అవాంచిత రోమాలు ఈజీగా తగ్గే టిప్ ?
పురుషులకు అవాంచిత రోమాలు కామన్. అయితే ప్రస్తుత కాలంలో అవాంఛిత రోమాలతో బాధపడే స్త్రీల సంఖ్య కూడా ఎక్కువవుతుందనే చెప్పవచ్చు. వివిధ రకాల అనారోగ్య సమస్యలతోపాటు హార్మోన్లకు సంబంధించిన మందులను వాడడం వల్ల స్త్రీలల్లో ఈ సమస్య అనేది చాలా ఎక్కువగా తలెత్తుతోంది.అయితే ఈ అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి మార్కెట్ లో దొరికే సౌందర్య సాధనాలను వాడడంతో పాటు వ్యాక్సింగ్ వంటి పద్దతులను కూడా ఫాలో అవుతుంటారు. అయితే వీటిని తరచూ వాడడం వల్ల చర్మం దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి సహజసిద్ధ మార్గాలను ఉపయోగించడమే చాలా మంచి పద్దతి.అయితే మన ఇంట్లో ఉండే సహజ పదార్థాలతో అవాంఛిత రోమాలను ఎలా ఈజీగా తొలగించుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ టిప్ తయారు చేసుకోవడానికి గాను మనం బేకింగ్ సోడా, నీళ్లు, దూదిని ఉపయోగించాల్సి ఉంటుంది. దీని కోసం ముందుగా శుభ్రమైన గిన్నెను తీసుకుని అందులో మూడు టీ స్పూన్ల గోరు వెచ్చని నీటిని తీసుకోవాలి. తరువాత అందులో ఒక టీ స్పూన్ బేకింగ్ సోడాను వేసి బాగా కలపాలి. తరువాత దూదిని తీసుకుని అందులో ముంచి అవాంఛిత రోమాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఈ మిశ్రమాన్ని రాసి ఈ దూదిని కూడా వాటిపై రాత్రంతా అలాగే ఉంచాలి.ఉదయాన్నే నీటితో ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. ఈ టిప్ ని తరచూ వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా ఎటువంటి ఖర్చు లేకుండా చాలా తక్కువ సమయంలోనే అవాంఛిత రోమాలను చాలా ఈజీగా తొలగించుకోవచ్చు. అవాంఛిత రోమాలతో బాధపడే వారు ఈ టిప్ ని పాటించడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు.కాబట్టి ఖచ్చితంగా పైన పేర్కొన్న టిప్స్ పాటించండి. ఖచ్చితంగా అవాంచిత రోమాలు అనేవి ఈజీగా తగ్గిపోతాయి.