పొల్యూషన్ అనేది రోజురోజుకూ చాలా వేగంగా పెరుగుతూనే ఉంది. దుమ్ము, మట్టి అనారోగ్యం, చర్మాన్ని ఎన్నో రకాలుగా ప్రభావితం చేస్తాయి. ఈ సమస్యలన్నీ కూడా పొడి చర్మానికి బాగా దారితీస్తాయి.కెమికల్ ఫేస్ క్రీమ్స్, స్కిన్ లొకేషన్స్ , వంటివి తక్కువ వాడటమే ఉత్తమం. ఇంటి నివారణలతో చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ హోం రెమెడీస్ తక్షణ ఫలితాలను ఇవ్వకపోయినా దీర్ఘకాలంగా చర్మాని జాగ్రతగా కాపాడుతుంది. కానీ చర్మానికి ఎటువంటి హాని కలిగించవు.బాదం పాలకు అనేక చర్మ, ఆరోగ్య సమస్యలను నయం చేసే శక్తి ఉంది. బాదం మిల్క్‌ను ముఖానికి రాసుకుంటే మొటిమల నుంచి వచ్చే అనేక ఇతర సమస్యలు దూరం అవుతాయి.బాదం పాలు చర్మాన్ని కాంతివంతంగా మార్చేందుకు పని చేస్తాయి. ఇందులో లాక్టిక్ యాసిడ్ కంటెంట్ ఉంటుంది, ఇది చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడంలో సహాయపడుతుంది. దీని కోసం పడుకునే ముందు బాదం పాలను అప్లై చేసి, ఉదయాన్నే లేచి ముఖం కడుక్కోండి. ఇలా చేయడం వల్ల ముఖం సహజమైన కాంతిని సంతరించుకుంటుంది.
ఆహారం ,పానీయాలు బ్యూటీ ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగించడం వల్ల చర్మంపై ముడతలు రావడం ప్రారంభమవుతాయి. ముడతలు పోవాలంటే బాదం పాలతో ముఖానికి మసాజ్ చేయండి. వృద్ధాప్య ప్రభావం ముఖంపై కనిపించకుండా చేస్తుంది.చాలా మందికి కూడా చర్మం చాలా పొడిగా ఉంటుంది. ఊరికే వారి చర్మం చాలా డ్రైగా మారిపోతూ ఉంటుంది. ఇక దీని కోసం, చల్లని పాలలో బాదం ముక్కలను వేసి, ఆపై ఈ పాలను మిక్సీలో రుబ్బుకోవాలి. తర్వాత ఈ పాలను ముఖానికి పట్టించి 10 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల డ్రై స్కిన్ తొలగిపోయి ఇన్ఫెక్షన్ దరిచేరదు. చర్మంపైన ఉండే ముడతలు కూడా తొలిగిపోతాయి.అలాగే బాదం పాలు ఖచ్చితంగా రోజూ తాగండి. అవి ఆరోగ్యానికి ఇంకా అలాగే అందానికి చాలా మేలు చేస్తాయి.