ముఖంపై ముడతలా.. ఇలా చేస్తే సరి..!!
1). గిన్నెలో కాస్త నిమ్మరసం తీసుకొని, అందులోకి కొంచెం తేనెను వేసి బాగా కలిపి ముఖానికి అప్లై చేసిన తర్వాత పది నిమిషాలు అలానే ఉంచి.. గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకున్నట్లు అయితే చర్మం మృదువుగా మారుతుంది. ఇక నిమ్మకాయలో ఉండే విటమిన్ సి వల్ల ముఖంపై ముడతలు తొలగడానికి సహాయపడుతుంది.
2). ఒక గిన్నెలో దోసకాయ రసాన్ని తీసుకొని బాగా కలిపి ముఖం పైన మసాజ్ చేసుకోవాలి. అలా ఆరిపోయేంతవరకు ఉంచుకొని ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముడతలు తగ్గుతాయి. ఇందులో మినరల్స్ విటమిన్లు పుష్కలంగా ఉండడం వల్ల ముఖం పైన ఉండే ముడతలు తగ్గడానికి ఇది చాలా సహాయపడతాయి.
3). అరటిపండు గుజ్జును తీసుకొని అందులోకి కాస్త నారింజ రసం, ఆవు పెరుగు కలిపి ఆ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖం పైన అప్లై చేసుకొని ఒక అర నిమిషం తర్వాత నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖం పైన ముడతలు తొలగిపోయి చర్మం యవ్వనంగా ఆరోగ్యంగా కనిపిస్తుంది.
4). పడుకొనే ముందు కొబ్బరి నూనెను ముఖానికి అప్లై చేసి పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కున్నట్లు అయితే ముఖం మెరుస్తుంది.
అయితే మొటిమలు మచ్చలు ఉన్నవారు కూడా వీటిని పాటించడం వల్ల అవి తగ్గే అవకాశం ఉంటుంది.