జిడ్డుని తొలగించి అందంగా మార్చే టిప్స్?

Purushottham Vinay
ఇక చర్మ కణాల గ్రంధుల నుంచి జిడ్డు ఎక్కువగా ఉత్పత్తి అయినప్పుడు మొటిమలు, మచ్చలు ఇంకా వృద్ధాప్య ఛాయలు వంటి ఇతర చర్మ సమస్యలు ఎక్కువగా ఏర్పడతాయి.ఇక అలా చిన్నవయసులోనే వయసు పైబడిన వారిలా కనిపిస్తారు. ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఆర్టిఫిషియల్ క్రీమ్స్ వాడకం బదులుగా ఇక ఇంటిలోనే సహజసిద్ధమైన బ్యూటీ టిప్స్ ను అనుసరిస్తే చాలా మంచి ఫలితం ఉంటుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. ఇక అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..మీ చర్మం జిడ్డుగా ఉన్నప్పుడు ఎంత మేకప్ వేసిన కూడా తగిన ఫలితం ఉండదు.ఇక చర్మ గ్రంధుల  నుండి ఉత్పత్తి అయ్యే అధిక మొత్తంలోని నూనె పదార్థం చర్మ సౌందర్యాన్ని బాగా దెబ్బతీస్తుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఇంకా ఆయిల్ ఫుడ్స్ లకు దూరంగా ఉంటూ సరైన ఆహార జీవనశైలి అనుసరిస్తూ సహజసిద్ధమైన టిప్స్ ను కనుక అనుసరిస్తే చక్కటి అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం అవుతుంది.ఇలా తక్కువ ఖర్చుతో మీరు మీ సౌందర్యాన్ని చాలా ఈజీగా పెంచుకోవచ్చు.


అందుకు ఒక కప్పులో కొద్దిగా పసుపు, కొన్ని పాలు వేసి బాగా పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ఇంకా మెడకు బాగా అప్లై చేసుకుని ఒక 20 నిమిషాల తరువాత ముఖాన్ని నీటితో బాగా శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే పసుపులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ ఇంకా యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు జిడ్డు చర్మ సమస్యలను తగ్గించి చర్మాన్ని అందంగా ఇంకా అలాగే ఆకర్షణీయంగా మారుస్తాయి.అలాగే పెసరపిండి, పెరుగు జిడ్డు సమస్యలను తగ్గించడానికి చాలా చక్కగా సహాయపడతాయి. ఇక ఇందుకోసం ఒక కప్పులో కొద్దిగా పెసర పిండి, కాస్త పెరుగు ఇంకా అలాగే కొన్ని నీళ్లు పోసి పేస్టులా తయారుచేసుకోవాలి. ఇక ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని ఒక అరగంట తరువాత ముఖాన్ని నీటితో బాగా శుభ్రపరుచుకోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు కనుక చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: