ఈ డ్రింక్స్ తాగితే బరువు తగ్గి స్లింగా అందంగా అవుతారు!

Purushottham Vinay
బరువు తగ్గించడంలో సహాయపడడంతో పాటు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచేందుకు  కొన్ని పనిచేస్తాయి. మరి అధిక బరువును తగ్గించుకునేందుకు ఎలాంటి పానీయాలను ఆహారంలో చేర్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం రండి.


1.యాపిల్‌, క్యారెట్‌ డ్రింక్‌..యాపిల్స్, దుంపలు ఇంకా క్యారెట్‌లను ఉపయోగించి డిటాక్స్ డ్రింక్ తయారు చేసుకోవచ్చు. ఈ మూడింటితో తయారుచేసిన డిటాక్స్ డ్రింక్‌లో ఫైబర్ అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. పైగా ఇందులో చాలా తక్కువ క్యాలరీలు అనేవి కూడా ఉంటాయి. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను చాలా ఈజీగా తొలగిస్తుంది. అలాగే జీర్ణవ్యవస్థను కూడా చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది.


2.ఆరెంజ్ ఇంకా క్యారెట్ డ్రింక్‌..నారింజ ఇంకా క్యారెట్లు రుచిగా ఉండడమే కాకుండా పలు పోషకాలతో కూడా నిండి ఉంటాయి. ముఖ్యంగా వీటిలో విటమిన్ సి అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. ఈ రెండిటిని మిక్స్ చేసి అద్భుతమైన డ్రింక్ ని తయారు చేసుకోవచ్చు. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడటమే కాకుండా మన బాడీ నుండి కూడా హానికరమైన టాక్సిన్స్ ను ఈజీగా బయటకు పంపుతుంది.


3.దోసకాయ, పుదీనా..ఇక ఈ రెండు పదార్థాలు కూడా ఆరోగ్యానికి చాలామంచివి. ఇవి మీ శరీరాన్ని బాగా చల్లబరుస్తాయి. అంతేకాదు రోజంతా కూడా ఎనర్జిటిక్‌ ఉంచడంలో సహాయపడతాయి. దోసకాయలో నీరు కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో బాగా సహాయపడుతుంది. ఈ రెండు పదార్థాలను కలపడం ద్వారా మీరు డిటాక్స్ డ్రింక్‌ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ పానీయం తాగడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది.


4.దాల్చిన చెక్కతో..ఒక జార్ నీటిలో కొన్ని యాపిల్ ముక్కలు, పుదీనా ఆకులు, నిమ్మకాయ ముక్కలు, అల్లం ముక్కలు ఇంకా అలాగే దాల్చిన చెక్కలను వేయండి. ఇప్పుడు అందులో నీరు కూడా వేసి బాగా కలపాలి.ఇక ఈ మిశ్రమాన్ని 6 నుంచి 7 గంటల పాటు పక్కన పెట్టండి. ఆ తర్వాత దాన్ని వడబోసి తేనెను మిక్స్‌ చేయండి. ఖాళీ కడుపుతో దీన్ని తాగడం వల్ల చాలా సులభంగా బరువు తగ్గుతారు.


5.మెంతి డిటాక్స్ డ్రింక్..ఇక ఈ పానీయం తయారు చేయడం కూడా చాలా సులభం. దీని కోసం, ఒక చెంచా మెంతి గింజలను తీసుకొని రాత్రంతా కూడా నీటిలో నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం వడపోసి దీనికి కొద్దిగా నిమ్మరసం కూడా కలపండి. ఆ తర్వాత దీన్ని ఖాళీ కడుపుతో దీన్ని సేవించాలి. ఇలా తీసుకోవడం వల్ల వేగంగా మీరు బరువు తగ్గుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: