కలబందతో ఇలా చేస్తే ఈజీగా బరువు తగ్గొచ్చు!

Purushottham Vinay
కలబందలో ఉండే విటమిన్లు ఎ, సి, ఇ, ఫోలిక్ యాసిడ్, కోలిన్, మెగ్నీషియం, జింక్, క్రోమియం, సెలీనియం, సోడియం, ఐరన్, జింక్ ఇంకా అలాగే మాంగనీస్ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయనడంలో అసలు ఎలాంటి సందేహం లేదు. అంతే కాదు, కలబంద మీ నడుముచుట్టూ ఉన్న కొవ్వును కూడా చాలా ఈజీగా తగ్గిస్తుంది.అందువల్ల మీ బరువు చాలా త్వరగా తగ్గేందుకు ఇది బాగా సహాయపడుతుంది. అలాగే అలోవెరా జెల్ శరీరంలోని విష పదార్థాలను బయటకు తీసి బరువు తగ్గడంలో చాలా బాగా సహాయపడుతుంది.ఇక కలబందను ఉపయోగించి ఎలా బరువు తగ్గించుకోవచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాం..ఇక నిమ్మరసంతో కలబందను కలిపి తీసుకోవడం వల్ల ఈజీగా మీ బరువు తగ్గొచ్చు. ఒక గ్లాసు నీటిలో నిమ్మరసం మిక్స్ చేసి అందులో ఈ కలబంద రసాన్ని కలపండి. ఈ మిశ్రమాన్ని ఉదయం పూట తాగాలి.ఇక ఇది ఒక అద్భుతమైన పానీయం. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల దాని ప్రయోజనాలు అనేవి మరింత పెరుగుతాయి.


అలాగే కలబంద తాజా ఆకులను తీసుకుని, ఇంకా దానిలోని గుజ్జును బయటకు తీయాలి. ప్రతిరోజూ ఉదయం  పూట ఖాళీ కడుపుతో ఈ గుజ్జును తినండి. ఇలా చేయడం వల్ల మీ బరువు ఈజీగా తగ్గడం మొదలవుతుంది.అలాగే తినడానికి ముందు కలబంద రసం తీసుకుంటే, బరువు చాలా ఈజీగా తగ్గొచ్చు. ఇందుకోసం భోజనానికి ఒక 20 నిమిషాల ముందు ఒక చెంచా కలబంద రసం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ బాగా మెరుగుపడుతుంది. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. దీని వల్ల శరీరంలో నిల్వ ఉండే కొవ్వు కూడా చాలా వేగంగా కరిగిపోతుంది. అలాగే అలోవెరాలో విటమిన్ బి కూడా ఉంటుంది. ఇది కొవ్వును విచ్ఛిన్నం చేసి శక్తిగా మార్చడం ద్వారా బాగా పనిచేస్తుంది. ఇక అలాగే దీన్ని రెండు వారాల పాటు ఉపయోగిస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: