మెరిసే అందానికి సూపర్ టిప్స్..

Purushottham Vinay
జిడ్డు చర్మంతో బాధ పడేవారు బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు ముఖాన్ని ఫేస్ వాష్ తో తప్పనిసరిగా శుభ్ర పరుస్తారు. ఇక అందంగా మారాలని ప్రతి ఒక్కరికీ కూడా ఉంటుంది. దీని కోసం వారు ఎంతో ఖర్చు పెడతారు. ఖరీదైన క్రీమ్స్ ని కూడా వాడతారు. ఎన్నెన్నో టిప్స్ కూడా పాటిస్తారు. ఇక ఇలాంటి వాటి కంటే కొన్ని హోమ్ టిప్స్ పాటించడం వల్ల ఎంతో అందంగా తయారవ్వొచ్చు. మేకప్ వేసుకునే ముందు బ్యూటీ ప్రొడక్ట్స్  వాడటం గురించి పూర్తిగా అవగాహన అనేది మీరు కలిగి ఉండాలి. వీటిని సరైన పద్ధతిలో కనుక మీరు వాడకపోతే చర్మం పాడయ్యే అవకాశం చాలా ఉంటుంది. అందువల్ల మీ చర్మం నల్లబడటం, దద్దుర్లు, మంట మొటిమలు, మచ్చలు వంటి సమస్యలు అనేవి ఏర్పడతాయి.కాబట్టి మేకప్ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.ఇక మేకప్ వేసుకోవడానికి ముందు మన చేతులను బాగా శుభ్రపరచుకోవాలి. ఆ తరువాత మొదట ముఖానికి మాయిశ్చరైజర్ ను రాసుకున్న తర్వాతనే మేకప్ ని వేసుకోవాలి.


ఇలా చేస్తే మేకప్ తాలూకా కెమికల్స్ మీ చర్మానికి హాని చేయవు. కాబట్టి మేకప్ కు ముందు మాయిశ్చరైజర్ రాయడం అనేది తప్పనిసరి.ఇక మీ చర్మానికి సరిపోయే బ్యూటీ ప్రొడక్ట్స్ ను ఖచ్చితంగా ఎంచుకోండి. ఆ బ్యూటీ ప్రొడక్ట్స్ ని మొదటిసారి కనుక మీరు వాడుతుంటే మీ శరీర తత్వానికి అవి సరిపోతాయో లేదో ఒకసారి పరీక్షించుకోవడం మంచిది. మీకు ఆ ప్రొడక్ట్స్ కారణంగా ఎటువంటి అలర్జీ, దద్దుర్లు ఇంకా ఇబ్బంది లేదని నిర్ధారణ అయిన తర్వాత వాటిని ఉపయోగించడం చాలా మంచిది.కాబట్టి కళ్ళకు వేసుకునే మేకప్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. కళ్ళకు ఉపయోగించే ప్రొడక్ట్స్ కారణంగా ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. కళ్ళకు మేకప్ వేసుకున్నప్పుడు కళ్ల మంట, ఎరుపు ఇంకా అలాగే నీళ్లు కారడం వంటి కంటి సమస్యలు ఏర్పడితే వెంటనే నీళ్ళతో కళ్ళను బాగా శుభ్రపరచుకోవాలి. అయినా కంటికి ఇబ్బంది కలిగితే పచ్చి పాలలో ముంచిన దూదితో తుడుచుకుంటే మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: