స్కిన్ టోన్: నిత్య యవ్వనం పొందాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!

Divya
ప్రస్తుత కాలంలో తీసుకునే ఆహారంలో పోషకాల లోపాలు, వాతావరణ కాలుష్యం, పొల్యూషన్, దుమ్ము,ధూళి, నీటిలో కలుషితం ఇలా అన్నీ కూడా చిన్న వయసులోనే వృద్ధాప్య లక్షణాలు కనిపించడానికి దారితీస్తున్నాయి.. కాబట్టి వయసుకు తగ్గట్టు చర్మసౌందర్యం ఉండాలి అని అంతేకాదు సంవత్సరాల వయసు పెరుగుతున్న కొద్దీ ప్రతి ఒక్క అమ్మాయి కూడా నిత్యం యవ్వనంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదు. ఇందుకోసం కష్టపడాల్సి ఉంటుంది..సౌందర్య నిపుణులు ఏం చెబుతున్నారు అంటే నిత్యం చర్మసౌందర్యం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి అని.. అవేంటో ఇప్పుడు మనం కూడా ఒకసారి చదివి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
సాధారణంగా వయసు పెరిగే కొద్దీ అమ్మాయిలలో చర్మం కాంతి మారిపోవడం.. ముడతలు రావడం .. చర్మంపై నల్లటి మచ్చలు ఏర్పడడం.. వృద్ధాప్య ఛాయలు కనిపించడం వంటి లక్షణాలు రావడం సహజమే.. అంతేకాకుండా చర్మం ప్రభావితమవుతూ  ఉండడం వల్ల వృద్ధాప్య ఛాయలు వంటి సమస్యలు కనిపిస్తాయి. ముందు నుంచి ఇలాంటి సమస్యలను దూరం చేసుకోవాలి అంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.. మనం ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసుకోవాలి.. ప్రతిరోజు వ్యాయామం చేయడం.. ఐదు లీటర్ల నీటిని తాగడం.. పోషకాహారం తీసుకోవడం .. కంటినిండా నిద్ర వంటివి ఉంటేనే ఆరోగ్యంగా చర్మం ఉండగలుగుతుంది.
ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు చర్మంపై ఉండే మేకప్ పూర్తిగా తొలగించి మాయిశ్చరైజర్ తో చాలా సున్నితంగా మసాజ్ చేయడం వల్ల చర్మాన్ని ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఇలా చేయడం వల్ల చర్మానికి కావలసిన తేమ అంది కాంతివంతంగా కూడా ఉంటుంది.. ముఖ్యంగా ఎండలోకి వెళ్లాలంటే ఉన్నప్పుడు అర్ధగంట ముందు సన్ స్క్రీన్ లోషన్ ను తప్పకుండా ఉపయోగించాలి.. 30 సంవత్సరాల వయసులో మహిళ యొక్క జీవన క్రియలు కూడా నెమ్మదిస్తాయి.. దాంతో చర్మం జిడ్డుగా మారడం, పొడిబారడం వంటి సమస్యలు తలెత్తుతాయి.. కాబట్టి మాయిశ్చరైజర్ ఉపయోగించి చర్మతత్వానికి సరిపడే బ్యూటీ ప్రొడక్ట్స్ ను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. 40 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు విటమిన్ ఏ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి.A

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: