బ్యూటీ: శీతాకాలంలో నిత్య యవ్వనంగా కనిపించాలంటే..?

Divya
కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరికీ ఏదో ఒక తెలియని కొత్త ఉత్సాహం మదిలో ఉప్పొంగుతుంది. ఏదైనా సరే కొత్తగా చేయాలని ఆలోచిస్తూ అందుకు తగ్గట్టుగా ప్రణాళికలను కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో ని బ్యూటీ లేదా ఫ్యాషన్స్ ఎందుకు ప్రాముఖ్యత ఇవ్వకూడదు అని ఆలోచన కూడా కొంతమందిలో తలెత్తుతోంది.. ఇకపోతే అందరిలాగే కాకుండా మీరు కూడా ఈ కొత్త సంవత్సరం ఎందుకు భిన్నంగా కనిపించకూడదు..? అయితే ఈ కొత్త సంవత్సరం మీరు అందరికంటే అందంగా కనిపించాలంటే ఒక కొత్త లుక్ ట్రై చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ శీతాకాలంలో మీ చర్మ సౌందర్యాన్ని మెరుగు పరుచుకోవడానికి ప్రయత్నం చేయాలి.
ముఖ్యంగా ఈ చలికాలంలో మేకప్ వేసుకోవడం వల్ల ముఖంపై మచ్చలు , మొటిమలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాదు చర్మం పొడిగా మారి రఫ్ గా తయారు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ. అందుకే ఈ చలికాలంలో చర్మాన్ని సంరక్షించుకోవాలి.. రాత్రి సమయాలలో చర్మ సంరక్షణ పాటించడం వల్ల ఈ చలికాలంలో అందమైన మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. ఇకపోతే చర్మాన్ని  ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఈ చిన్న చిట్కాలు పాటించండి.
1. ఫేస్ క్లీన్:
ఈ చలికాలంలో అందంగా కనిపించాలంటే ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు తప్పకుండా మీ ముఖాన్ని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. పడుకునే ముందు తప్పకుండా మేకప్ ను తొలగించి ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల చర్మంలో పేరుకుపోయిన మురికి తొలగిపోయి, మొటిమల సమస్య రాకుండా కాపాడుతుంది.
2. సీరం:
చర్మ రక్షణకు సీరం చాలా ఉపయోగపడుతుంది. సౌందర్య నిపుణులు కూడా చర్మం తాజాగా మెరవడానికి ఈ సీరం  చాలా దోహద పడుతుందని చెబుతున్నారు. ముఖం కడుక్కున్న తర్వాత రాత్రిపూట ముఖానికి రాసుకుంటే మొటిమలు తొలగిపోతాయి. కాబట్టి రాత్రివేళ చర్మ రక్షణ కోసం తప్పకుండా ఈ సీరం అప్లై చేసుకోండి.
3. గోరువెచ్చని నూనె:
జుట్టు పొడిగా, గరుకుగా మారిపోకుండా ఉండాలంటే రాత్రిపూట తలకు గోరువెచ్చని నూనెను అప్లై చేసి మసాజ్ చేయాలి .ఉదయాన్నే తలస్నానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: