మీ చర్మం మృదువుగా ఉండాలంటే ఇలా చేయండి..!!

Divya
అందమైన.. మృదువైన చర్మం ఎవరు మాత్రం కాదంటారు.. చాలా మంది తమ ముఖాన్ని అందంగా తీర్చి దిద్దుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ బిజీ బిజీ లైఫ్ లో పొల్యూషన్, దుమ్ము, ధూళి వంటి కారణాల వల్ల చర్మం ఎన్నో రకాల సమస్యలకు గురి అవుతోంది. చాలామంది ముఖాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని ఎంత ప్రయత్నించినప్పటికీ బిజీ లైఫ్లో వారికి సమయం లేక ముఖాన్ని చాలా అధ్వానంగా మార్చుకుంటూ ఉంటారు. ఇకపోతే ఎలాంటి బిజీ లైఫ్ లో అయినా సరే ముఖం అందంగా మృదువుగా మారాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి అవేంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..

రాత్రి సమయంలో మేకప్ తొలగించడం:
చాలామంది అందంగా కనిపించడానికి రకరకాల బ్రాండ్ మేకప్ ఉత్పత్తులను ఉపయోగిస్తూ ఉంటారు.  అయితే వీటిని అప్లై చేయడం వల్ల  ముఖ చర్మాన్ని  పూర్తిగా కప్పి చేయడం వల్ల చర్మం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. ఎప్పుడైతే చర్మానికి గాలి తగలకుండా ఉంటుందో అప్పుడు చర్మం పొడిబారి పగుళ్లు ఏర్పడే ప్రమాదం కూడా ఉంటుంది.. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అయినా మేకప్ వేసుకున్న రోజు రాత్రి తప్పకుండా ఆలివ్ ఆయిల్ తో క్లీన్ చేసుకున్న తర్వాత శుభ్రం చేసుకొని నిద్రపోవాలి.

సన్ స్క్రీన్ లోషన్ తప్పనిసరి:
ఇంటి నుంచి బయటకు వెళ్ళినా సరే లేదా ఇంట్లో ఉన్నా సరే తప్పకుండా ఈ సన్ స్క్రీన్ లోషన్ ను ఉపయోగించాలి. ఎందుకంటే ఈ లోషన్ ను అప్లై చేయడం వల్ల సూర్యుని నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు లేకపోతే త్వరగా డామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది.
సరైన ఆహార పదార్థాలు తీసుకోవడం:
చర్మం ఆరోగ్యంగా ఉండాలి అంటే విటమిన్ సి , విటమిన్ కె వంటి విటమిన్లు తప్పకుండా అందివ్వాలి. విటమిన్ సి కలిగిన ఆహార పదార్థాలను తీసుకొని , చక్కెర పదార్థాలు తగ్గించడం వల్ల చర్మం అందంగా తయారవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: