గ్రీన్ టీతో ఇలా చేస్తే మొటిమలు మటుమాయం..!!

Purushottham Vinay
చాలా మందిని మొటిమల సమస్య బాగా వేధిస్తూ ఉంటుంది.గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఎక్కువగా ఉంటాయి. ఇవి మొటిమలు ఇంకా వాటి వల్ల ఏర్పడే మచ్చలను సులభంగా తగ్గించడంలో సహాయపడతాయి. ఇక ఇందులో యాంటీ బాక్టీరియల్ ఏజెంట్లు కూడా ఉన్నాయి, ఇవి బ్యాక్టీరియాను ఈజీగా నిరోధించడంలో ఎంతగానో సహాయపడతాయి. యాంటీఆక్సిడెంట్ మచ్చలు ఇంకా గాయాలను తగ్గిస్తాయి. చర్మంలో పెద్ద రంధ్రాలు తెరుచుకోవడం అలాగే మచ్చలను తొలగించడానికి గ్రీన్ టీని ఎలా ఉపయోగించాలి ఇంకా దాని ప్రయోజనాలను ఎలా పొందాలో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం.
1.గ్రీన్ టీ ఇంకా క్యారెట్..
ఇక ఇందుకు అవసరమైన పదార్థాలు
* రెండు టేబుల్ స్పూన్లు గ్రీన్ టీ
* ఒక టేబుల్ స్పూన్ వండిన క్యారెట్ గుజ్జు
తయారు చేసే విధానం..
కొన్ని క్యారెట్ ముక్కలను బాగా ఉడికించి వాటిని చల్లారనివ్వాలి.
అలాగే దాని కోసం కొద్దిగా గ్రీన్ టీ ఇంకా క్యారెట్ గుజ్జును కలిపి ఆ రెండూ మిక్స్ చేయండి.
ఇక ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతంలో అప్లై చేసి కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచాలి.
ఇక ఆ తరువాత శుభ్రమైన నీటితో ముఖం బాగా శుభ్రం చేసుకోండి.
చక్కటి ఫలితాల కోసం రోజుకు ఒకసారి ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి ఉపయోగించండి.
2.గ్రీన్ టీ ఇంకా తేనె...
కావాల్సిన పదార్థాలు:
* ఒక టేబుల్ స్పూన్ గ్రీన్ టీ
* ఒక టేబుల్ స్పూన్ తేనె
తయారు చేసే విధానం..
ఇక ఒక చిన్న గాజు పింగాణీ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె ఇంకా గ్రీన్ టీని కలిపి మిశ్రమంగా చేసుకోండి.
ఈ మిశ్రమంలో కాటన్ ని ముంచి మొటిమలు వున్న ప్రాంతంలో బాగా మసాజ్ చేయండి.
ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు అలాగే ఉంచి గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగి ఆరనివ్వాలి.
ఇలా ఒక నెల రోజుల పాటు రోజుకు రెండుసార్లు చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: