చిన్న వయసులోనే మీ జుట్టు తెల్లబడుతోందా... ?

VAMSI
వయసు మీద పడే కొద్ది మన శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి అలాగే మన జుట్టు కూడా తెల్లబడుతుంది. కానీ నేటి జనరేషన్ లో చాలా మందికి చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోతుంటుంది మరియు కొంతమందికి జుట్టు ఊడిపోతూ ఉంటుంది. మారిన జీవన విధానాల వలన ఆహారపు అలవాట్లు, ఆలోచనలు, జీన్స్ వలన ఇలా రకరకాల కారణాల వలన జుట్టు తెల్లబడుతూ ఉంటుంది. అక్కడక్కడ అసహ్యంగా కనిపించే ఆ తెల్ల జుట్టును దాచడానికి కవర్ చేయడానికి.. డై అని, హెన్న అని రకరకాల వాటిని వినియోగిస్తుంటారు. ఎందుకంటే అందంగా కనిపించాలి అంటే జుట్టు కూడా ఆకర్షణీయంగా ఉండటం చాలా ముఖ్యం. అయినా అందంగా కనిపించాలని ఎవరికి అనిపించదు.
ఎవరైనా అందంగా కనిపించడంలో జుట్టు పాత్ర కూడా ఉంటుంది కాబట్టి జుట్టు అందరికీ అంత శ్రద్ధ. మరి మన జుట్టు తెల్లబడకుండా లేదా తేబడిన జుట్టు నల్లగా మారడానికి మరియు జుట్టు ఊడకుండా ఉండడానికి ఏమిచేయాలో ఇప్పుడు చూద్దాం.
* కొన్ని మిరియాలను మెత్తని పేస్టులా నూరి జుట్టు ఊడిన చోట కనుక బాగా రుద్దితే వెంట్రకలు కుదుళ్లు వద్ద గట్టి పడి అక్కడ తిరిగి జుట్టు పెరుగుతుంది.
* కొబ్బరి నూనెలో కొద్దిగా కరివేపాకు వేసి బాగా మరిగించాలి. ఆ నూనె బాగా చల్లారాక వడ కట్టి నిల్వ చేసుకొని రోజూ జుట్టుకు ఈ నూనె తలకు బాగా పట్టించి వలన జుట్టు త్వరగా తెల్ల పడకుండా ఉంటుంది.
* దోసెడు మందార ఆకులు తీసుకుని మెత్తగా పేస్టు చేసుకోవాలి. అందులో నాలుగు స్పూన్ల పెరుగు కలిపి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు అంటుకునేలా పట్టించి ఒక గంట ఆగి గోరు వెచ్చటి నీటితో తల స్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తుండాలి. తద్వారా తెల్లగా మారిన జుట్టు మళ్ళీ నల్లబడుతుంది.
* బాగా ఎండబెట్టినటువంటి పసుపు కొమ్ములను పొడి చేసుకుని ఒక డబ్బాలో నిలువ చేసుకోవాలి. నాలుగు టీ స్పూన్ల పసుపుకు కాస్త వెన్నను కలిపి ముద్దగా నూరి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి గంట తరువాత  తల స్నానం చేసేయాలి. ఇలా చేయడం వలన జుట్టు నల్లగా నిగనిగ లాడుతుంది అంతేకాదు  వెంట్రుకలు చిట్లడం కూడా తగ్గుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: