అమ్మాయిల కురులు పొడవుగా ఒత్తుగా కావాలా?

VAMSI
అమ్మాయిలకు అయినా అబ్బాయిలకు అయినా జుట్టుంటేనే ముఖం అందంగా కనిపిస్తుంది. కాకపోతే ఆడ వారికి పొడవైన, ఒత్తైన జుట్టు ఉంటే కూడా ముచ్చటగా ఉంటుంది. కానీ జుట్టు తరచూ రాలుతుంది అంటే క్రమంగా జుట్టు పలుచబడిపోతుంది. చాలా సన్నగా పీలగా అనిపిస్తుంది. మహిళలకు అయిన పురుషులకు అయిన ఒత్తైన జుట్టు ఉంటేనే మరింత అందం. లేదంటే పెద్దగా ఆకర్షణీయంగా అనిపించదు. అయితే జుట్టు రాలకుండా ఉండాలన్నా, కొత్త జుట్టు పెరగాలన్నా ఓ సారి ఈ సలహాను పాటించి చూడండి అని చెబుతున్నారు ఆయుర్వేదిక్ నిపుణులు. అది కూడా మీరు వీటి కోసం షాపులకు పరుగులు తీయనక్కర్లేదు. అన్ని మనకు ఇంట్లో అందుబాటులో ఉండేవే ఒక్క ఎసెన్షియల్ ఆయిల్ మాత్రం తెచ్చుకుంటే సరిపోతుంది. ఇంతకీ ఆ పదార్థాలు ఏమిటి ప్రాసెస్ ఏమిటో తెలుసుకుందాం.
జుట్టు పెరుగుదలకు ఉల్లిపాయ చాలా పెద్ద మేలు చేస్తుందని అందరికీ తెలిసిందే.  కాగా ఈ మిశ్రమాన్ని తయారు చేయడానికి, ముందుగు పెద్దవి అయితే నాలుగు లేదా చిన్నవి అయితే ఐదు ఉల్లిపాయలను తీసుకుని మిక్సికి వేసి బాగా మెత్తను పేస్ట్ లా చేసుకోవాలి. తరువాత అందులో నుండి రసాన్ని టీ వడకట్టే ఫిల్టర్ ను ఉపయోగించి వేరు చేయాలి. ఈ రసాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని ఇందులో నాలుగైదు చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ ను కలపాలి. అందులోనే ఒక టీస్పూన్ తేనెను వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు పట్టేలా తలకు బాగా అంటుకుని దాదాపు అరగంట పాటు మసాజ్ చేసుకోవాలి.
ఆ తరవాత రాత్రంతా అలాగే వదిలి ఉదయం గోరువెచ్చటి నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారైనా చేయడం వలన మీ జుట్టు రాలడం తగ్గుతుంది. పొడవు కూడా బాగా పెరుగుతుంది.  ఇలా చేయడం మొదలు పెట్టిన ఒకటి రెండు నెలల్లోనే మీకు మీ జుట్టు రాలడం, పొడవు పెరగడంలో మార్పు కనిపిస్తుంది. మీ జుట్టు దృఢంగా పొడవుగా ఒత్తుగా పెరగడానికి ఇదో చక్కటి ఉపాయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: