ముఖంపై తెల్ల మచ్చలు అసహ్యంగా ఉన్నాయా?

VAMSI
చర్మం అనేది మన శరీరంపై ఎంతో కీలక పాత్రను పోషిస్తుంది. మన చర్మం అందంగా..ఆకర్షణీయంగా వుండాలని అందరూ కోరుకుంటాం. అయితే చాలా మంది ముఖంపై మచ్చలతో బాధపడుతుంటారు. ముఖంపై మచ్చలు ఉంటే మన ముఖంలో కాంతి, తేజస్సు తగ్గుతుంది. మచ్చలు ఉండటం వలన ముఖం అందంగా కనిపించదు. మచ్చలు అనేవి...కొందరికి నల్లవి, కొందరికి ఎర్రవి, కొందరికి తెల్ల మచ్చలు వస్తుంటాయి.
 కొన్ని రకాల తెల్ల మచ్చలను బొల్లి అని అంటుంటారు. అయితే ఇపుడు ముఖంపై తెల్ల మచ్చలు పోగొట్టడానికి కొన్ని చిట్కాలను చూద్దాం.
* ఒక టీ స్పూను పసుపు పొడిలో రెండు టీ స్పూన్ల ఆవ నూనెను వేసి వాటిని బాగా కలపాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని తెల్ల మచ్చలు ఉన్న చోట అప్లై చేసి మసాజ్ లా నెమ్మదిగా రుద్దుకోవాలి. ఒక అరగంట ఆగి శుభ్రపరుచుకోవాలి. ఇలా తరచూ చేయడం వలన తెల్ల మచ్చలు క్రమేణా తగ్గుతాయి.
* వేపాకులను శుభ్రపరచి మెత్తటి పేస్టు లా చేసుకోవాలి.  ఆ పేస్టు లో కాస్త మజ్జిగ కలిపి దాన్ని ముఖంపై మచ్చలు ఉన్న చోట రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసుకొని ఉదయాన్నే శుభ్రపరుచుకోవాలి. ఒక అరగంట వరకు సోపు ను వినియోగించరాదు.  

* ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లు అయితే మెల్లగా మార్పు అనేది మీకే స్పష్టంగా కనపడుతుంది. తెల్ల మచ్చలు క్రమేణా తగ్గుతాయి.
* తెల్ల మచ్చలు ఉన్న వారికి హోమియో పతిలో మంచి చికిత్స ఉంది. హోమియో పతి తెల్ల మచ్చలు నివారణకు మంచి ఫలితాలను ఇస్తుందని చెబుతున్నారు. అలాగే ఈ తెల్ల మచ్చలు తొలగించుటకు లేజర్ మరియు అల్ట్రాసౌండ్ పద్ధతులు కూడా ఎక్కువగా వినియోగిస్తుంటారు. కానీ పెరటి వైద్యం అనేది అన్ని రకాలుగా శ్రేయస్కరం అని పెద్దలు చెబుతుంటారు కాబట్టి ఒకసారి ఈ చిట్కాలను పాటించి చూడండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: