ఒత్తైన మరియు పొడవు జుట్టు లేదని నిరాశ పడుతున్నారా ?

VAMSI
మగవారితో పోలిస్తే స్త్రీలకు జుట్టుపై ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఆడవారికి జుట్టు అనేది ఒక ప్రత్యేకమైన ఆకర్షణ. ప్రతి ఒక్క ఆడపిల్ల పొడవైన జుట్టు, ఒత్తయిన జుట్టు ఉండాలని ఆశ పడుతుంది. కానీ అందరికీ పొడవు జుట్టు ఉండదు. అలాంటి వారు జుట్టు లావుగా, పొడవుగా పెరగాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. పెరటి చిట్కాలు, ఆయుర్వేదిక్ ఆయిల్లు, కండిషనర్లు ఇలా ప్రతి ఒక్కటి ట్రై చేస్తుంటారు. కానీ అందరికీ మంచి రిజల్ట్ రాకపోవచ్చు. వారు కోరుకున్న విధంగా వారి జుట్టు పెరగక పోవచ్చు. దీనికి పలు రకాల కారణాలు ఉంటాయి. ఎందుకంటే ఒకరికి మంచి ఫలితాన్ని ఇచ్చిన షాంపూ మరొకరికి అదే రిజల్ట్ అందిస్తుందని చెప్పలేం. ఎందుకంటే వారి వారి జుట్టును బట్టి షాంపూలను ఎంపిక చేసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.
కొందరికి స్ట్రాంగ్ హైర్ ఉంటే మరికొందరి హైర్ చాలా మృదువుగా..సున్నితంగా ఉంటుంది. అలాంటప్పుడు ఇటువంటి వారు వారి జుట్టు విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి.  చాలామంది తరచూ షాంపూలు మారుస్తూ ఉంటారు. కానీ ఇలా చేయకూడదు. ఏ షాంపూ వల్ల అయితే మీ జుట్టులో కాస్తైనా మెరుగైన మార్పు వచ్చింది అనిపిస్తే ఇక ఆ షాంపుకే ఫిక్స్ అవ్వండి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన మీ జుట్టును అందంగా పొడవుగా పెరిగేలా చేయొచ్చు. షాంపూను మరి ఎక్కువ వేసుకోకండి. ఒక కాయిన్ సైజ్ లో షాంపూను రెండు సార్లు అప్లై చేస్తే చాలు. షాంపూ అప్లై చేసేటప్పుడు బాగా మర్దన లాగా కుదుళ్ళ వరకు వెళ్లేలా చేయండి.
అదే విధంగా శుభ్రం చేసేటప్పుడు కూడా జుట్టు నుండి షాంపూ మొత్తం వెళ్లి పోయే దాకా నీటితో బాగా కడగండి. వీలైనంత వరకు తలను ఆర పెట్టుకోవడానికి హెయిర్ డ్రయ్యర్ వాడక పోవడమే మంచిది. దానికి బదులుగా ఒక పదినిమిషాలు అధికంగా కేటాయించి కాటన్ బట్టతో శుభ్రంగా తుడుస్తూ ఆరపెట్టుకోండి. బయట పొల్యూషన్ వల్ల మీ తలపై చుండ్రు వంటివి వచ్చినప్పుడు  ఈజీగా తీసుకోకుండా వెంటనే చుండ్రును పోగొట్టేలా వేపాకు పేస్ట్, మెంతుల పేస్ట్ వంటివి ఉపయోగించి చుండ్రు ని వదిలించుకోండి. కనీసం వారానికి రెండు సార్లైనా తలస్నానం చేయడం అలవాటు చేసుకోండి. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించడం వలన మీ జుట్టును సంరక్షించుకోవచ్చు...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: