ఇలా చేస్తే మొటిమలు తగ్గడం ఖాయం..

Purushottham Vinay
చర్మం మొటిమలు లేకుండా తాజాగా  మారడానికి, ముఖ సౌందర్యంని బాగా పెంచుకోడానికి క్యారెట్ చాలా బాగా పని చేస్తుంది. క్యారెట్ జ్యూస్ రోజు తాగడం వల్ల ముఖంపై మొటిమలు వెంటనే తగ్గిపోతాయి. అలాగే క్యారెట్, పెరుగు ఇంకా ఎగ్ వైట్ లను సమపాళ్లలో బాగా కలుపుకుని ఆ మిశ్రమాన్ని మీ ముఖానికి బాగా రాసుకోవాలి.ఒక 15 నిమిషాలు అలాగే ఉంచుకుని గోరువెచ్చని నీళ్లతో కడిగేసేయాలి. ఇలా రోజు చేస్తే మీ చర్మంపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్ వెంటనే తొలగిపోతాయి.అలాగే చర్మం ఎంతో ఫ్రెష్ అవుతుంది. అలాగే ఆయిలీ స్కిన్ ఉన్నవారికి సైతం క్యారెట్లతో చాలా మంచి ప్రయోజనం అనేది కలుగుతుంది.  ఒక కప్పు క్యారెట్ జ్యూస్ తీసుకోని అందులో ఒక్కో టేబులు స్పూన్ పెరుగు, శెనగ పిండి ఇంకా నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఇక ఈ మిశ్రమాన్ని ముఖానికి ఇంకా మెడకు మంచి ప్యాక్‌గా వేసుకోవాలి. ఇక అలాగే ఓ అరగంట తరువాత గోరువెచ్చని నీటితో కడిగితే మీరు వెంటనే ఆయిలీ స్కిన్ నుంచి విముక్తి పొందవచ్చు. ఇంకా ముఖంపై మొటిమలు కూడా వెంటనే తగ్గిపోతాయి.

అలాగే క్యారెట్ సగం ముక్కను బాగా తురుం చేసి లేదా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీలో వేసి పేస్ట్ గా తయారు చేయాలి.అలాగే ఇందులో ఒక టీ స్పూన్ తేనెను ఇంకా ఒక టీ స్పూన్ పాలు వేసి బాగా మిక్స్ చేసి చర్మానికి రాయాలి. ఇక ఒక 15 నిమిషాల తరువాత చల్లని నీళ్లతో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా రోజు చేస్తే.. మీ చర్మం బాగా తేమగా ఇంకా మృదువుగా ఉంటుంది. ఇక ఇదే మిశ్రమాన్ని ముఖానికి ఫేస్ ప్యాక్ ‌గా కూడా వేసుకోవచ్చు.ఇక మొటిమలకే కాకుండా అలాగే సన్ ప్రొటెక్షన్ స్ప్రేగా కూడా క్యారెట్ ఎంతగానో ఉపయోగపడుతుంది.  క్యారెట్ జ్యూస్ ఇంకా రోజ్ వాటర్‌ ను సమపాళ్లలో కలిపి వాటిని స్ప్రే బాటిల్‌లో నింపి స్టోర్ చేసుకోవాలి. ఇక అలాగే సన్ ప్రొటెక్షన్ స్ప్రేగా వాడుకుంటే సన్ లైట్, దుమ్ము ఇంకా ధూళి నుంచి చర్మాన్ని కాపాడుతుంది. ఇక క్యారెట్ ఇంకా అలాగే అలోవెరా జ్యూస్‌లను కలిపిన మిశ్రమాన్ని కనుక రాసుకుంటే  చర్మ సౌందర్యం పెరిగి మొటిమలు మచ్చలు మొత్తం తగ్గి ముఖానికి మంచి కళ అనేది వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: