ఈ తప్పులు చేస్తే మీ ముఖం నాశనమైనట్లే...

Purushottham Vinay
ఇక చాలా మంది కూడా కొన్ని కొన్ని తప్పులు చేసి అనవసరంగా ముఖాన్ని చాలా పాడు చేసుకుంటారు. ఇక చాలా మంది కూడా నిద్రపోయే ముందు మేకప్ తీయకపోవడం అనేది సాధారణంగా చేసే తప్పులలో ఒకటి. ఇది చర్మ రంధ్రాలను అడ్డుకోవడమే కాకుండా మీ చర్మం అలాగే పర్యావరణం మధ్య అవరోధాన్ని సృష్టిస్తుంది.ఇక చాలా మంది కూడా సన్‌స్క్రీన్ వాడరు. సన్ స్క్రీన్ వాడకపోవడం అనేది చాలా మంది చేసే మరో పెద్ద తప్పు. మీ చర్మంపై ముడతలు ఇంకా గీతలు అలాగే వృద్ధాప్య సంకేతాలు రాకుండా సన్‌స్క్రీన్ అనేది నిలువరిస్తుంది.మీ ముఖాన్ని ఎక్కువగా తాకడం ద్వారా కూడా మొటిమలు అనేవి వస్తాయి.మీ ముఖాన్ని తాకడం వల్ల మీ వేళ్ళలోని బ్యాక్టీరియా మొటిమలు ఏర్పడటానికి దారి తీస్తుంది.చర్మాన్ని శుభ్రంగా ఉంచాలనుకోవడంలో మృదువైన సబ్బును ఎంచుకోవడం చాలా మంచిది.ఇక అలాగే ఇష్టం వచ్చినట్లుగా బ్యూటీ ప్రొడక్ట్స్ వాడటం కూడా అనేక చర్మ సమస్యలకు కూడా దారితీస్తుందట.ఇవి కొంతమందికి సెట్ అవుతాయి ఇంకా అలాగే మరి కొంతమందికి నష్టాన్ని కూడా చేకూరుస్తాయి.
ఇక మీరు ఉపయోగించాల్సిన ముఖ్యమైన చర్మ సంరక్షణ ఉత్పత్తులలో మాయిశ్చరైజర్ ఒకటనే చెప్పాలి.జిడ్డు చర్మం ఇంకా మొటిమల బారిన పడిన చర్మం ఉన్నప్పటికీ మాయిశ్చరైజర్‌ను మానేయడం అంత మంచిది కాదట. కాబట్టి తప్పకుండా మాయిశ్చరైజర్ వాడాలి.ఇంకా మీ చర్మాన్ని బాగా ఆరోగ్యంగా ఉంచడానికి నిద్ర అనేది చాలా ముఖ్యమైనది. మీరు కంటి నిండా బాగా ప్రశాంతంగా నిద్రపోకపోతే అది ఖచ్చితంగా మీ ముఖంపై ప్రభావాన్ని చూపుతుంది.అలాగే స్నానం చేసిన తర్వాత మీ చర్మాన్ని తుడవడానికి మెత్తటి టవల్ ని వాడాలి. లేదంటే మీ చర్మం బాగా పొడబారి గరుకుగా తయారవుతుంది.ఇక అలాగే అశుద్ధమైన మేకప్ ఉత్పత్తులను ఉపయోగించడం మొటిమలకు పెద్ద కారణం అవుతుందట. మీరు ముఖాన్ని బాగా శుభ్రంగా వుంచుకోవడానికి మేకప్ బ్రష్‌లు ఇంకా స్పాంజ్‌లను ఉపయోగించడం అలవాటు చేసుకుంటే వాటిని క్రమం తప్పకుండా కడగాలి.ఇక అలాగే మీరు మొటిమలను గిల్లడం లాంటివి చేస్తే బ్యాక్టీరియా దాని చుట్టూ చేరి ముఖం మొత్తం వ్యాపిస్తుందట.కాబట్టి ఖచ్చితంగా ఇలా చేయడం మానుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: