ముఖంపై ముడతలు తగ్గే చిట్కాలు...

Purushottham Vinay
చాలా మందికి తక్కువ వయస్సులోనే ముడతలు వస్తుంటాయి. అవి ఎలా తగ్గించుకోవాలో తెలియక చాలా రకాలుగా ట్రై చేస్తుంటారు. అయితే ఈ టిప్స్ పాటించడం వలన చాలా ఈజీగా ముడతలు తగ్గించుకోవచ్చు. అవేంటో తెలుసుకోండి. ముందుగా ఒక టేబుల్ స్పూన్ అలోవెరా జెల్‌లో ఆరు చుక్కల రోజ్ మేరీ ఆయిల్ కలపండి. బాగా మిక్స్ చేసి ఫేస్ కి అప్లై చేసి కాసేపు మసాజ్ చేయండి. పదిహేను ఇరవై నిమిషాల తరువాత కడిగేయండి. రోజుకి ఒకసారి ఇలా చేయొచ్చు.మూడు టేబుల్ స్పూన్ల తేనెలో పది చుక్కల సినమన్ ఆయిల్ కలపండి. ఫేస్ మీద అప్లై చేయండి. పదిహేను ఇరవై నిమిషాల తరువాత కడిగేయండి. రోజుకి ఒకసారి ఇలా చేయవచ్చు.మూడు టీ స్పూన్ల అలోవెరా జెల్‌లో ఒక టీ స్పూన్ రోజ్ హిప్ ఆయిల్, ఐదు చుక్కల లావెండర్ ఆయిల్, ఐదు చుక్కల లెమన్ ఆయిల్ కలపండి. ఈ మిశ్రమాన్ని ఒక గ్లాస్ బాటిల్‌లో వేసి స్టోర్ చేసుకోండి. రాత్రి నిద్రకి ముందు కొంచెం తీసుకుని కళ్ళ చుట్టూ మసాజ్ చేసుకుని పగలు కడిగేయండి. రోజుకి ఒకసారి ఇలా చేయవచ్చు.

ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెలో మూడు చుక్కల జెరేనియం ఆయిల్ కలపండి. బాగా మిక్స్ చేసి ఫేస్‌కి అప్లై చేయండి. మంచి ఫలితాల కోసం రాత్రంతా ఉంచేయవచ్చు. ఇలా రోజూ చేయవచ్చు, లేదా రోజు విడిచి రోజు అయినా చేయవచ్చు.ఐదు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్‌లో రెండు మూడు చుక్కల లావెండర్ ఆయిల్ వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ఫేస్‌కి అప్లై చేసి ఇరవై నిమిషాల తరువాత కడిగేయండి. రోజుకి ఒకసారి ఇలా చేయవచ్చు.ఒక కప్పు రోజ్ వాటర్ ఒక టేబుల్ స్పూన్ తాజాగా తీసిన అలోవెరా జెల్, పది చుక్కల నెరోలీ ఆయిల్ తీసుకుని వీటిని ఒక స్ప్రే బాటిల్‌లో పోసి బాగా కలపండి. షవర్ తరువాత, ఫేస్‌వాష్ తరువాత ఈ స్ప్రే చేసుకోండి. అవసరాన్ని బట్టి ఇలా రోజూ చేయవచ్చు.ఒక టేబుల్ స్పూన్ తేనెలో ఐదారు చుక్కల టీట్రీ ఆయిల్ కలిపి ఆ మిశ్రమాన్ని ఫేస్‌కి అప్లై చేయండి. పదిహేను, ఇరవై నిమిషాల తరువాత కడిగేయండి. రోజుకి ఒకసారి ఇలా చేయొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: