జిడ్డు చర్మానికి సెట్ అయ్యే సున్నిపిండి ఏదో తెలుసా..?

Divya


ప్రస్తుత కాలంలో ప్రతి అమ్మాయి తన అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి,  ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అందులో భాగంగానే మార్కెట్లో దొరికే ఎన్నో రకాల క్రీములను తీసుకొచ్చి,  ముఖానికి వాడుతూ వున్నారు. అలాగే డాక్టర్లను సైతం సంప్రదిస్తూ వారి ముఖానికి ఏ క్రీం సెట్ అవుతుందో కూడా తెలుసుకొని మరీ ఉపయోగిస్తున్నారు.  అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ సరైన ఫలితం లేక ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నారు. అలాంటి అన్ని ఇబ్బందులను తొలగించడానికి ఒకటే ఒక మార్గం సున్నిపిండి. సున్ని పిండి ని ఉపయోగించడం వల్ల  ఎటువంటి ఖర్చు లేకుండా, తక్కువ సమయంలోనే చర్మం యొక్క అందాన్ని  పెంపొందించుకోవచ్చు.

అది కూడా ఎలాంటి దుష్ప్రభావాలు కలగకుండా ముఖ అందాన్ని పెంపొందించుకోవచ్చు అంటున్నారు నిపుణులు.. అయితే ఈ సున్నిపిండిని వాడేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో ముఖ్యంగా జిడ్డు చర్మం ఉన్నవారికి ఎలాంటి సున్నిపిండి సెట్ అవుతుందో కూడా తెలుసుకొని ముఖానికి పిండి ని ఉపయోగించడం వల్ల మరింత ప్రయోజనాలు కలుగుతాయి.

జిడ్డు చర్మం కలవారు ఎలాంటి సున్నిపిండిని ఉపయోగించాలో, దానిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..

 కావలసిన పదార్థాలు :
 ముల్తానీ మట్టి  - ఒక కప్పు
 బార్లీ పొడి - ఒక కప్పు
 బియ్యం పిండి  - ఒక కప్పు
 పెసరపిండి  - ఒక కప్పు
 ఎండబెట్టిన గులాబీరేకులు  - ఒక కప్పు
 శనగపప్పు  - ఒక కప్పు
 పసుపు  - 3 టేబుల్ స్పూన్లు..

తయారీ విధానం : పైన చెప్పిన వాటన్నింటినీ ఒక్కొక్కటి చొప్పున మిక్సీలో వేసి మెత్తటి పౌడర్ లాగా  చేసుకుని ఒక గ్లాస్ జార్లో భద్రపరుచుకోవచ్చు.

ఇలా తయారుచేసి పెట్టుకున్న సున్నిపిండిని ప్రతి రోజూ స్నానం చేసేటప్పుడు ముఖానికి, శరీరానికి ఉపయోగించడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. అంతే కాకుండా ముఖం మీద ఏర్పడిన నల్లటి మచ్చలు, ముడతలు, మొటిమలు,  మొటిమల కారణంగా వచ్చే మచ్చలు కూడా తొలిగిపోతాయి. అంతేకాకుండా జిడ్డు చర్మం కలవారు ఈ సున్నిపిండిని ఉపయోగించడం వల్ల జిడ్డు మొత్తం పోయి, చర్మం కాంతివంతంగా తయారవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా సున్నిపిండిని  తయారు చేసుకొని మీ ముఖాన్ని కూడా కాంతివంతంగా తయారు చేసుకోండి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: