బ్యూటీ : అవాంచిత రొమాలను ఇలా ఈజీగా తొలగించుకోండి....

Purushottham Vinay
అవాంఛిత రోమాలు తొలగించుకోవాలనుకొనేవారు.. ఎపిలేటర్ సాయంతో ఆ పనిని సులువుగా చేసుకోవచ్చు. ఇది వెంట్రుకలను రూట్‌తో సహా తొలగిస్తుంది కాబట్టి.. ఎక్కువ రోజులు అవాంఛిత రోమాలకు దూరంగా ఉండవచ్చు. ఈ పరికరంతో కాళ్లు, చేతులపై ఉన్న వెంట్రుకలను తొలగించుకోవచ్చు.అయితే ఖచ్చితంగా మంచి నాణ్యమైన ఎపిలేటర్ ని వాడండి.ఇంట్లోనే అవాంఛిత రోమాలను తొలగించుకోవాలనుకొనేవారు షేవింగ్ చేసుకుంటూ ఉంటారు. దీనికోసం ప్రత్యేకంగా రూపొందించిన డిస్పోజబుల్ రేజర్స్, ఎలక్ట్రికల్ రేజర్స్ ఉపయోగించవచ్చు. ఈ పద్ధతిలో లెగ్స్, ఆర్మ్స్, అండర్ ఆర్మ్స్, బికినీలైన్ వద్ద ఉన్న అన్వాంటెడ్ హెయిర్ సులభంగా, తక్కువ సమయంలో తొలగించుకోవచ్చు.


ఈ పద్ధతిని పాటిస్తే వెంట్రుకల పెరుగుదల వేగంగా ఉంటుంది. ఎందుకంటే రేజర్ వాటిని కట్ చేస్తుంది తప్ప.. లోపలి నుంచి వెంట్రుకలని తొలగించదు.కాబట్టి ప్రతి రెండు మూడు రోజులకోసారి అవాంఛిత రోమాలను తొలగించుకోవాల్సి ఉంటుంది. రేజర్ ఉపయోగించి వెంట్రుకలను తొలగించుకొనేటప్పుడు చర్మం తెగిపోయే అవకాశాలుంటాయి కాబట్టి.. కాస్త జాగ్రత్తగా షేవ్ చేసుకోవాలి. షేవ్ చేసుకొనే ముందు  షేవింగ్ క్రీం లేదా సబ్బు రాసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా షేవ్ చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ రేజర్ ఉపయోగిస్తే సబ్బు లేదా షేవింగ్ క్రీం ఉపయోగించకూడదు.


వెంట్రుకలు పెరుగుతున్న దిశకు వ్యతిరేక దిశలో షేవ్ చేసుకోవాల్సి ఉంటుంది.వ్యాక్సింగ్ చేసుకోవడానికి సెలూన్‌కి వెళ్లేవారు కొందరైతే.. ఇంట్లోనే వ్యాక్సింగ్ కిట్ సాయంతో అవాంఛిత రోమాలు తొలగించుకొనేవారు కూడా ఉంటారు.వ్యాక్సింగ్ ద్వారా అవాంఛిత రోమాలను తొలగించుకొంటే.. రెండు నుంచి నాలుగు వారాల పాటు వెంట్రుకలు పెరగకుండా ఉంటాయి. వ్యాక్సింగ్ ద్వారా ఫేసియల్ హెయిర్ తొలగించుకోవాలనుకొంటే మాత్రం పార్లర్‌కి వెళ్లడమే మంచిది. మీరు వ్యాక్సింగ్ కిట్ ఉపయోగించి వెంట్రుకలను తొలగించుకోవాలనుకొంటే.. స్ట్రిప్‌ను చర్మానికి అతికించి చర్మాన్ని గట్టిగా పట్టుకొని వ్యతిరేక దిశలో వేగంగా లాగాల్సి ఉంటుంది.నెమ్మదిగా తీస్తే నొప్పి ఎక్కువగా ఉండటమే కాకుండా.. ఎక్కడి వెంట్రుకలు అక్కడే ఉంటాయి.


అదే కోల్డ్ వ్యాక్స్ లేదా హాట్ వ్యాక్స్ ఉపయోగించి వెంట్రుకలు తొలగించుకోవాలంటే.. స్పాచులాతో వెంట్రుకలు పెరుగుతున్న దిశలో వ్యాక్స్ అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత  డిస్పోజబుల్ వ్యాక్స్ స్ట్రిప్స్ వ్యాక్స్ పై ఉంచి.. వ్యాక్స్ రాసిన దిశలోనే గట్టిగా ఒత్తాలి. ఆ తర్వాత చర్మాన్ని గట్టిగా పట్టుకొని వ్యతిరేక దిశలో పైకి లాగితే సరిపోతుంది. దీనికోసం డిస్పోజబుల్ వ్యాక్స్ స్ట్రిప్స్‌కి బదులుగా పాత జీన్స్ క్లాత్ కూడా ఉపయోగించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: