గోరింటాకు హెయిర్ ప్యాక్ వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..!

Divya

ప్రతి ఒక్కరు జుట్టు పెరుగుదల కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే మార్కెట్లో దొరికే ఎన్నో రకాల ఆయిల్స్ ను, షాంపూలను తీసుకొచ్చి జుట్టుకు పట్టిస్తూ ఉంటారు. అలాగే అమ్మమ్మలు చెప్పే చిట్కాలు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే బయట దొరికే ఆయిల్స్, షాంపూ ల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు  అనేది వాస్తవం.  ఈ షాంపూలను ఎక్కువగా వాడడం వల్ల జుట్టు గడ్డిలాగ మారిపోయి, జుట్టు యొక్క సాంద్రత కూడా కోల్పోతుంది.  తద్వారా జుట్టు గడ్డి లాగా మారిపోయి, జీవం లేని దాని లాగ మిగిలిపోతుంది. అమ్మమ్మలు చెప్పే చిట్కాలు లో ముఖ్యమైనది గోరింటాకు హెయిర్ ప్యాక్.. అయితే ఈ గోరింటాకు హెయిర్ ప్యాక్ ను ఎలా తయారు చేసుకోవాలి..  దీనిని ఎలా వాడాలి.. వాడిన తర్వాత ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం...

గోరింటాకు హెయిర్ ప్యాక్ కు కావలసిన పదార్థాలు :
గోరింటాకులను మన జుట్టుకు ఎంత సరిపోతుందో అన్ని ఆకులు తీసుకుని, ఎండబెట్టి పొడి చేసుకోవాలి.  ఒకవేళ మాకు అందుబాటులో లేవు అని అనుకున్న వాళ్లకు గోరింటాకు పౌడర్ మార్కెట్లో లభ్యమవుతోంది. అలాగే ఉసిరి పొడి,  కొద్దిగా పెరుగు, నాలుగు టేబుల్ స్పూన్ల టీ డికాక్షన్.. 1 విటమిన్ ఈ క్యాప్సిల్..

తయారీ విధానం :
ఒక గిన్నెలో మీ జుట్టుకు సరిపడా గోరింటాకు పౌడర్ ను తీసుకోవాలి.  అందులో రెండు టేబుల్ స్పూన్ల ఉసిరి పొడి,  ఒక కప్పు పెరుగు, నాలుగు టేబుల్ స్పూన్ల టీ డికాక్షన్, ఒక విటమిన్ ఈ క్యాప్సిల్స్  అన్నీ వేసి మెత్తగా పేస్టు లాగా తయారు చేయాలి. అయితే ఈ మిశ్రమాన్ని కలిపేటప్పుడు ఎలాంటి ఉండలు లేకుండా నున్నటి పేస్టు లాగా తయారు చేయాలి. ఆ తర్వాత ఈ పేస్ట్ ను తయారు చేసి పెట్టిన గిన్నె పైభాగానా ఒక కవరు మూసి టైట్ గా కట్టాలి.

ఎలా వాడాలి :
ఇక మరుసటి రోజు ఉదయం ఈ గిన్నెను తీసుకొని ఆ కవర్ తీసేసి, జుట్టును పాయలు పాయలుగా చేసి జుట్టు కుదుళ్ల నుంచి జుట్టు కొనల వరకు మొత్తం పట్టించాలి.. ఆ తర్వాత 40 నిమిషాల పాటు ఆరనిచ్చి, ఆ తరువాత చల్లని నీటితో తలస్నానం చేయాలి. అయితే స్నానం చేసిన రోజు ఎలాంటి షాంపూ లు ఉపయోగించరాదు. మరుసటి రోజు తలకు కొబ్బరి నూనె పట్టించి ఒక గంట ఆగి గాఢత కలిగిన షాంపూతో తలస్నానం చేయడం ఉత్తమం..

ఉపయోగాలు :
జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే జుట్టు కొనలు చిట్లి పోయినట్లు వున్నా,  మధ్యలో బ్రేక్ అవుతున్నట్లు ఉన్న ఈ హెయిర్ ప్యాక్ మంచిగా పని చేస్తుంది. అంతేకాకుండా జుట్టుకు కావలసిన చల్లదనం కూడా ఈ ప్యాక్ అందిస్తుంది. జుట్టు తెల్లగా ఉన్నట్టు ఉంటే అది కూడా కలర్లోకి వస్తుంది. కాబట్టి  ఈ హెయిర్ ప్యాక్ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలగవు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: