మనం చేసే చిన్న పొరపాటు వల్ల జుట్టు ఎక్కువగా రాలుతోంది.. ఆ పొరపాటు ఏంటో తెలుసా..?
సాధారణంగా జుట్టు అందంగా, ఒత్తుగా, పొడవుగా పెరగాలంటే పూర్వకాలంలో సహజ పద్ధతులను పాటించేవారు. కానీ ప్రస్తుత కాలంలో హెయిర్ ట్రీట్ మెంట్ ప్రాసెసింగ్ మెషిన్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ జుట్టు ని స్టైల్ గా మార్చడానికి తహతహలాడుతున్నారు. అయితే ఇలాంటి ఎలక్ట్రానిక్స్ మెషిన్స్ వల్ల జుట్టు నిర్జీవమైపోయి, జుట్టు రాలే సమస్య తలెత్తుతోంది.. అందులోనూ మరీ ముఖ్యంగా మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కూడా జుట్టు అధికంగా రాలిపోతుంది. అయితే ఆ పొరపాటు ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకోండి...
1. జుట్టు తడిగా ఉన్నప్పుడు దువ్వడం :
మనలో చాలామంది హడావిడిగా జుట్టు తడిగా ఉన్నప్పుడు దువ్వేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల జుట్టు ఎక్కువగా రాలుతుంది. అంతేకాకుండా చాలా మంది తడి జుట్టుతోనే నిద్రపోవడం చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల జుట్టు ఒత్తిడికి గురయి త్వరగా రాలిపోతుంది..
2.స్టైలింగ్ ఎక్విప్మెంట్ ను తరచూ వాడడం :
ప్రస్తుతం అందరి కళ్ళు తిప్పుకోలేనంత అందంగా ఉండాలని కోరుకుంటున్నారు. అయితే అందుకు తగ్గట్టుగానే స్టైలింగ్ ఎక్విప్మెంట్స్ ను రోజువారి బేసిస్ లో ఉపయోగిస్తున్నారు.. అయితే వీటిని ఎక్కువగా ఉపయోగించకుండా వారానికి ఒకసారి మాత్రమే ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే వీటి నుండి వెలువడే వేడి, జుట్టును నిర్జీవంగా చేస్తాయి. కుదుళ్లలో ఉండే ఆయిల్ కాస్త తగ్గిపోతుంది..
3. కుదుళ్లను పెద్దగా పట్టించుకోకపోవడం :
జుట్టుకు సంబంధించి ఎంత జాగ్రత్త తీసుకుంటారో అంతే జాగ్రత్త కూడా ఉండాలి. ఎందుకంటే మీ స్కాల్ఫ్ ఎంత హెల్దీగా ఉంటుందో, అప్పుడే మీ జుట్టు కూడా అంత ఆరోగ్యంగా ఉంటుంది. మీరు మీ కుదుళ్లను ఎప్పుడైతే బాగా మసాజ్ చేస్తారో అప్పుడు రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు.
4. జుట్టు వదిలేసి పడుకోవడం :
చాలామంది పడుకునేటప్పుడు జుట్టు వదిలేసి పడుకుంటే బాగుంటుంది అనుకోని అలా ఫ్రీ హెయిర్ చేసేసి పడుకుంటారు. అలా చేయడం వల్ల జుట్టు అనవసరంగా చిక్కుపడుతుంది. ఇక చిక్కుపడిన జుట్టును చిక్కు వదిలించాలంటే మాత్రం జుట్టు రాలిపోతుంది..
కాబట్టి మీరు చేసే ఈ చిన్న చిన్న పొరపాట్ల వల్ల జుట్టు రాలే సమస్య ఎక్కువ అవుతోంది. కాబట్టి ఇక నుంచైనా జాగ్రత్తపడండి..