
హ్యాంగోవర్ కారణంగా ముఖం ఉబ్బినట్లు అనిపిస్తోందా..!
నాటి నుంచి నేటి వరకూ మద్యం ప్రియులు ఎక్కువ అవుతున్నారు. విపరీతంగా తాగుతూ హ్యాంగోవర్ కి గురి అవుతున్నారు. ఇలాంటివారు ఉదయాన్నే లేచే సరికి ముఖం ఉబ్బినట్టు,చూడటానికి భయంకరంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే హ్యాంగోవర్ కారణంగా ముఖం ఉబ్బినట్లు అనిపిస్తే అలాంటప్పుడు ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలను పాటించి, మీ ముఖాన్ని నార్మల్ స్థితికి తీసుకొని రండి. అయితే ఆ చిట్కాలేంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..
మీ చర్మాన్ని తిరిగి అందంగా చేసుకోవాలంటే, ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. రోజుకు ఆరు నుంచి ఎనిమిది లీటర్ల నీరు తాగితే డీహైడ్రేషన్ మీ దరిచేరదు. ప్రస్తుతం సెలవులు కూడా అయిపోయాయి కాబట్టి ఇక పార్టీలకు,ఫంక్షన్లకు అటెండ్ అయ్యే సమయం కూడా మీ దగ్గర ఉండదు. అయినా కూడా మీ చర్మం డల్ గా ఉందంటే, దానికి మీరు ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని అర్థం. అలాగే కాక్టైల్ వంటివి తాగడం వల్ల కూడా ముఖం ఉబ్బి పోయినట్టు కనిపిస్తుంది. ఇక ఫలితంగా మీ చర్మం డీహైడ్రేషన్ కు గురి అయి ముఖం నిర్జీవంగా కనిపిస్తుంది.
ఇందుకోసం మీరు కొన్ని దోసకాయలను,పుదీనాను కలిపి చల్లని నీటిలో కలిపి సిప్ చేస్తూ ఉంటే, మీ చర్మం అనేది లోపల నుండి కోలుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే లోపలినుండి మార్పు కావాలి అంటే మంచి ఆహారం,నీళ్లు తీసుకోవడం అనేది ముఖ్యమైనది. ఇలా చేయడం వల్ల సహజంగా మీ చర్మకాంతి ని మీరు తిరిగి పొందవచ్చు.
ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మీ హాంగోవర్ తగ్గకపోతే,ఒక కప్పు కాఫీ ని ఆస్వాదించండి. ఇందులో ఉండే కెఫిన్ మీరు సహజంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. కెఫిన్ కు యాక్టివ్గా ఉండే లక్షణం ఎక్కువ. కాబట్టి కాఫీని తాగినప్పుడు లేదా కాఫీ పొడితో కళ్ళ కింద మసాజ్ చేసినప్పుడు చర్మం తాజాగా కనిపిస్తుంది. అంతేకాకుండా విటమిన్ లు ఎక్కువ కలిగిన ఆహారాలు తీసుకుంటూ ఉండాలి.