షవర్ కింద స్నానం చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా..?
చాలా వేడి నీటితో స్నానం చేయడం :
కొంతమందికి చాలా వేడి నీటితో స్నానం చేసే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం వల్ల చర్మం చాలా పొడిగా మారడం తో పాటు జుట్టు లోని తేమ పూర్తిగా తొలగించబడుతుంది. అలాగే జుట్టు రాలే సమస్యలు, జుట్టు పొడిబారడం, తేమను కోల్పోయి నిర్జీవంగా మారడం లాంటి సమస్యలు ఏర్పడతాయి.
జుట్టును గట్టిగా రుద్దడం :
షవర్ కింద స్నానం చేసేటప్పుడు, తల మీద ఉన్న దుమ్ము ని వదిలించుకోవడానికి గాఢత కలిగిన షాంపూలతో జుట్టుపై రుద్దుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల జుట్టు ఒత్తిడికి గురై, జుట్టు రాలడం ప్రారంభమవుతుంది.
కండిషనర్ ను తప్పించడం :
మనలో చాలామంది షాంపూ చేసిన తర్వాత కండిషనర్ల ను ఉపయోగించరు. అందుకు కారణం కండిషనర్ యొక్క నిజమైన ప్రయోజనం వారికి తెలియకపోవడం. కాబట్టి షవర్ స్నానం చేసిన తర్వాత జుట్టుకు కండిషనర్ పెట్టడం ఎంతో ముఖ్యం.