తలస్నానం చేశాక జుట్టు త్వరగా ఆరడం లేదా..? అయితే ఇలా చేయండి..

Divya

తలస్నానం చేసిన తర్వాత జుట్టు ఆరేందుకు ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిని పాటిస్తూ ఉంటారు. కొంతమంది జుట్టుని సహజంగా ఆరబెట్టుకుంటే,మరికొంతమంది హెయిర్ బ్లోయర్ ను ఉపయోగిస్తుంటారు. అయితే హెయిర్ బ్లోయర్ ఉపయోగించడం వల్ల జుట్టు డ్యామేజ్ అవుతుందని తెలిసినప్పటికీ, వారి దగ్గర సరైన సమయం లేకపోవడం వల్ల ఈ బ్లోయర్ లను వాడుతుంటారు. కానీ ఏం చేసినా సరే,జుట్టు త్వరగా ఆరాలంటే మాత్రం, కంపల్సరిగా ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది.
అయితే ఇందుకోసం మన దగ్గర రెండు ఆప్షన్స్ ఉన్నాయి. అందులో ఒకటి త్వరగా పొద్దున్నే నిద్రలేచి, తలస్నానం చేసి, జుట్టుని సహజంగా ఆరబెట్టుకోవడం,  లేదా కొన్ని సింపుల్ స్ట్రాటజీస్ ద్వారా జుట్టు సహజంగా ఆరేటట్లు చేయడం. అయితే ఇందులో మొదటి పద్ధతి చేయడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపరు. ఇక రెండవ పద్ధతి గురించి ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం..
మీరు తలస్నానం చేసిన తర్వాత బాడీకి ఉపయోగించే టవల్ ను, జుట్టుకు ఎప్పుడూ ఉపయోగించకూడదు. ఫలితంగా మీ క్యూటికల్స్ ని డ్యామేజ్ చేసి జుట్టు రఫ్ టెక్చర్ వస్తుంది. ఇందుకోసం మీరు మీ జుట్టుని పూర్తిగా ఆరబెట్టాలి అనుకుంటే ఈ టవల్ వదిలేసి, ఏదైనా ఒక కాటన్ టీ షర్ట్ తీసుకోండి. ఈ టీ షర్ట్ తడినంతటినీ ఒక్క క్షణంలో లాగేస్తుంది. జుట్టు కూడా మృదువుగా ఉంటుంది. ఒకవేళ మీకు టీషర్ట్ వాడడం ఇష్టం లేకపోతే మైక్రో ఫైబర్ టవల్ ను కూడా ఉపయోగించవచ్చు.
ఇక ఆ తర్వాత మిగిలిన మీ పనులన్నీ చేసేసుకోండి. అంటే మేకప్ వేసుకోవడం,ఎలాంటి బట్టలు వేసుకోవాలో రెడీ గా పెట్టుకోవడం లాంటివి.  మీ జుట్టుకు మైక్రో ఫైబర్ టవల్ కానీ, టీ షర్ట్ కానీ చుట్టి, మీ పనులు చేస్తే ఇవన్నీ అయ్యేటప్పటికి మీ జుట్టు ఆల్మోస్ట్ ఆరిపోతుంది.

చూశారు కదా ఫ్రెండ్స్.. ఈ పద్ధతిని ఉపయోగించి, త్వరగా మీ జుట్టుని ఆరబెట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తవు. జుట్టు మృదువుగా మారడానికి సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: