సోనం కపూర్ తన హెయిర్ కేర్ గురించి చెప్తానంటోంది.. మనము చూసేద్దాం రండి..!

Divya

అందం అంటే కేవలం బాహ్య ప్రపంచానికి కనిపించేది కాదు, శరీరం లోపల నుంచి  పోషణ అందినప్పుడే శాశ్వతమైన సౌందర్యం సొంతమవుతుంది అని  అంటోంది బాలీవుడ్ ఫ్యాషనిస్ట్ సోనం కపూర్.  ఎప్పటికప్పుడు ఇంస్టాగ్రామ్ లో చర్మ సౌందర్యం,జుట్టు ఆరోగ్యం గురించి చెప్పుకొచ్చే  ఈ భామ తాజాగా జుట్టు సంరక్షణకు సంబంధించిన ఒక సింపుల్ చిట్కాను ఇలా వివరించింది. ఇన్స్టాగ్రామ్ లో " వ్యానిటీ విన్యేట్స్" పేరుతో నిర్వహిస్తున్న బ్యూటీ సిరీస్ లో  భాగంగా ఇప్పటికే పలు వీడియో పోస్ట్ లు  మనకు షేర్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి అదే వేదికగా తన హెల్త్ కేర్ సీక్రెట్ ను బయటపెట్టింది.  అయితే ఆ సీక్రెట్స్ ఏంటో  మనమూ చూసేద్దాం రండి ..


జుట్టు సంరక్షణ కోసం ఆ నూనెలను మిక్స్ చేయాలి :
బాదం నూనె, కొబ్బరి నూనె తో పాటు అప్పుడప్పుడు విటమిన్ ఈ నూనెను కూడా కలిపి తయారు చేసిన మిశ్రమాన్ని కుదుళ్లకు, జుట్టు చివర్లకు అప్లై చేస్తూ ఉంటాలి. ఫలితంగా  జుట్టుకు పోషణ అందుతుంది. అలాగే అత్యవసర నూనె తో తయారు చేసిన సామ్రాని తో పొగ వేసి జుట్టుకు పట్టించాలి. ఇలా చేయడం వల్ల జుట్టు పట్టులా మారడమే కాకుండా చక్కటి పరిమళాన్ని కూడా అందిస్తుంది.

హెయిర్ స్టైలింగ్  టూల్స్, హెయిర్ డ్రైయర్స్, జుట్టుకు రంగు వేయడం ఇలాంటి ఎన్నో పద్ధతులను ఈ కాలం అమ్మాయిలు అనుసరిస్తున్నారు. వీటిని వాడడం వల్ల జుట్టు సహజసిద్ధమైన తేమను కోల్పోయి, పొడిబారుతుంది. తద్వారా జుట్టు గడ్డిలాగా,నిర్జీవంగా మారుతుంది. ఇక ఇలాంటి జుట్టుకు తగినంత తేమ అందించాలంటే బాదం నూనె, ఆలివ్ ఆయిల్ ను తరచూ జుట్టుకు అప్లై చేస్తూ ఉండాలి. ఈ నూనెలను జుట్టుకు వాడడం వల్ల జుట్టుకు తగినంత తేమ అందడంతో పాటు సిల్కీగా మారుతుంది.

పెప్పర్ మెంట్ నూనె,కొబ్బరి నూనె రెండు నూనెల
ను కలిపి వాడితే కుదుళ్లకు రక్తప్రసరణ బాగా జరిగి, లోపల కుదుళ్లు బలంగా తయారవుతాయి. అంతే కాకుండా జుట్టుకు తగినంత తేమ అందుతుంది. అలాగే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: