
చక్కటి అందం కోసం ఇవి తినండి...
వాటిలో ప్రధానంగా ఉండే ఆకుకూరలు, ఖనిజాలు, విటమిన్లను అధికంగా కలిగి ఉండి బలమైన, ఆరోగ్యకరమైన గోర్లు పెరగడానికి, చర్మ, జుట్టు సంరక్షణకు సహాయపడుతాయి.నిద్ర లేకపోవడం, అధిక పని ఒత్తిడి, డిప్రెషన్ కంటి చుట్టూ నల్లటి వలయాలకు కారణమవుతాయి. వీటి చికిత్సలో అరటి పండు ఉత్తమంగా పనిచేస్తుంది. అరటి పండులో విటమిన్ బి6 పుష్కలంగా ఉంటుంది, ఇది చిరాకు, నిద్రలేమిని నివారించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే మెగ్నీషియం, మంచి నిద్ర విధానాలను అందిస్తుంది.
జింక్, సల్ఫర్, విటమిన్ ఎ అధికంగా ఉండే గుమ్మడి గింజలు బలమైన జుట్టు నిర్మాణంలో సహాయపడతాయి.క్యారెట్స్‌లో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది, విటమిన్ ఎ ప్రధానంగా ఉండే ఈ క్యారెట్లు మెరిసే, ఆరోగ్యకరమైన జుట్టు, చర్మ సంరక్షణకు ఎంతగానో సాయం చేస్తుంది.ఇక ఇలాంటి మరెన్నో బ్యూటీ టిప్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...