పుల్లటి పెరుగు ముఖానికి రాస్తేనా...! ఇక అందమే అందం...!
ఇవి మన ఇంట్లోనే ఎక్కువగా ఉండే రెండు టేబుల్ స్పూన్స్ పెరుగు, మ్యాష్ చేసిన అరటిపండు అలాగే రెండు టేబుల్ స్పూన్స్ రోజ్ వాటర్ ను తీసుకుని ముఖం అలాగే మెడపై అప్లై చేసుకోండి. ఇలా ప్రతీ రోజు చేయాలి... ఇలా చేస్తే నేచురల్ గా స్కిన్ గ్లో ఉంటుంది. తేనె నిమ్మరసం ఫేస్ ప్యాక్ కూడా బాగుంటుంది. ఈ పదార్థాలన్నిటిలో స్కిన్ కేర్ ప్రాపర్టీస్ చాలానే ఉన్నాయి. వీటిని మిక్స్ చేస్తే ఈ ప్రాపర్టీస్ మరింతగా మెరుగుపడే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇక ఇది శక్తివంతమైన మాన్సూన్ స్కిన్ కేర్ ప్రోడక్ట్ కూడా మారిపోతుంది.
నిజం చెప్పాలి అంటే... మీరు గనుక ఈ ఫేస్ ప్యాక్ ను రెగ్యులర్ గా వాడితే మార్కెట్ లో లభించే కెమికల్ బేస్డ్ ప్రోడక్ట్స్ పై దృష్టి పెట్టే అవసరమే అసలు ఉండదు. ఇక ఆయిలీ టీ-జోన్ కలిగిన వారికి ఈ ఫేస్ ప్యాక్ ఎంతో ఉపయోగం అని నిపుణులు చెప్తున్నారు. కేవలం రెండే రెండు టేబుల్ స్పూన్స్ పెరుగు, ఒక టేబుల్ స్పూన్ తేనె అలాగే ఒక టీస్పూన్ నిమ్మరసాన్ని తీసుకుని పేస్ట్ లా చేసుకుని ముఖం అలాగే మేడపై మసాజ్ చేసుకుని పావు గంట తర్వాత కడిగేయండి.