అందం: స్ట్రెచ్ మార్క్స్‌ను తగ్గించే ఎఫెక్టివ్ టిప్స్..!!
స్ట్రెచ్ మార్క్స్.. ఈ సమస్యతో చాలా మంది మహిళలు ఇబ్బంది పడుతుంటారు. సాధారణంగా ప్రసవం తర్వాత మహిళల భాగంలో, తొడల మీద ఈ స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి. ఇది ఓసారి వచ్చాయంటే ఓ పట్టాన పోవు. ఇక ఈ స్ట్రెచ్ మార్క్స్ వల్ల అందమైన దుస్తులు వేసుకోవడానికి కాస్త వెనుకాడాల్సి వస్తుంది. దీంతో ఈ స్ట్రెచ్ మార్క్స్‌ను తగ్గించుకునేందుకు అనేక మార్గాలు ప్రయత్నిస్తారు. కానీ ఉపయోగం ఉండదు. అయితే ఇప్పుడు చెప్పబోయే ఎఫెక్టివ్ టిప్స్ ట్రై చేస్తే.. ఖచ్చితంగా స్ట్రెచ్ మార్క్స్‌ను దూరం చేసుకోవచ్చు. మరి అవేంటో ఓ లుక్కేసేయండి..
బంగాళదుంప తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలను స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రాంతంగా పది నిమిషాల పాటు రుద్దుకోవాలి. అనంతరం చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా ప్రతి రోజు చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. ఎన్నో రకాల చర్మ సమస్యలకు అలోవేరా చక్కని పరిష్కారం. అయితే స్ట్రెచ్ మార్క్స్ తగ్గించుకోవడంలోనూ అలోవేరా సహాయపడుతుంది. అలోవేరా జెల్ తీసుకుని.. స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రాంతంలో అప్లై.. పది నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఇలా ప్రతి రోజు చేస్తే.. స్ట్రెచ్ మార్క్స్ సమస్య నుంచి బయటపడవచ్చు.
ఇక సహజంగా స్ట్రెచ్ మర్క్స్ తగ్గించే పదార్థాలలో చక్కర కూడా ఒకటి. చక్కరని ఆల్మండ్ ఆయిల్తో కలిపి సంబంధిత ప్రాతంలో అప్లై చేయాలి. అర గంట తర్వాత చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా ప్రతి రోజు చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. అలాగే కొబ్బరి నూనె దాదాపు ప్రతిదానికీ నివారణగా ఉపాయోగిస్తారు. కొబ్బరి నూనె చర్మ గాయాలను నయం చేయడానికి, స్ట్రెచ్ మర్క్స్ తగ్గించడానికి సహాయపడుతుంది. అందుకే ప్రతిరోజు నిద్రించే ముందు స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రాంతంలో కొబ్బరి నూనె అప్లై చేసి పడుకోవాలి. ఇలా ప్రతి రోజు చేయడం వల్ల స్ట్రెచ్ మార్క్స్ సమస్యను నివారించవచ్చు.