సౌందర్య గుణాల గని..అడవి ఉసిరి..!!!

NCR

ఉసిరికాయలు అంటే ఇప్పటి వారికి తెలిసినది సహజంగా ఇంట్లో కాసే చిన్న ఉసిరి. కానీ అడవి ఉసిరి గురించి మాత్రం చాలా మందికి తెలియదు. ఈ ఉసిరి చేసే ఆరోగ్య ప్రయోజనాలు ,సౌదర్య ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఉసిరి సౌందర్య గుణాల గని అని చెప్పాలి. మార్కెట్ లో దొరికే ఏ సౌందర్య సాధనం చూసినా దానిలో ఉసిరికి సంభందించిన గుణాలు తప్పనిసరిగా ఉంటాయి.

 

ఈ అడవి ఉసిరి విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ని సమృద్దిగా శరీరానికి అందిస్తాయి.జుట్టు సమస్యల పరిష్కారానికి ఉసిరి చేసే మేలు మరేది చేయలేదు. మరి ఈ ఉసిరి ని ఉపయోగించి సౌందర్య సాధనం ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

 

ముందుగా నాలుగు  ఉసిరికాయలను తీసుకోని రెండు గంటలుపైగానే నానబెట్టి, వాటిని ముక్కలుగా కోయాలి.  ఆ తరువాత వాటిని మిక్సీ చేసి జ్యుస్ గా చేసుకొని ఉపయోగిచాలి. ఈ ఉసిరి నీటితో ముఖాన్ని ప్రతీ రోజు క్రమం తప్పకుండా కడుగుతూ ఉంటె చర్మం బిగుతుగా అవడమే కాకుండా ఎంతో సున్నితంగా కూడా మారుతుంది. ఉసిరి నీటిని రెగ్యులర్ గా వాడుతూ ఉంటే చర్మనికి ఉండే సాగే గుణం తగ్గి వ్రుద్ధ్యాప్యంలో వచ్చే ముడతలు రాకుండా చేస్తాయి.  

 

అంతేకాదు ముఖంపై ఉండే వైట్ హెడ్స్ ని తొలగించడంలో ఉసిరి నీరు చాలా అద్భుతంగా పని చేస్తుంది. ఇది చర్మ రంధ్రాలు తెరచుకునేలా చేసి రంధ్రాలలో పేరుకుని పోయిన మురికిని తొలగిస్తుంది. మృత కణాలని తొలగించడంలో ఉసిరి ఎంతగానో ఉపయోగపడుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: