"చలికాలంలో జుట్టు" సంరక్షణకి ఈ జాగ్రత్తలు తప్పనిసరి
సాధారణ అన్ని
కాలాలలో కంటే చలికాలంలో జుట్టు ఎక్కువగా
దెబ్బతింటుంది..జుట్టు చిట్లినట్టుగా మారడం..పొడిగా ఉండటం..చుండ్రు ఎక్కువగా
పట్టడం జరుగుతుంది..అయితే ఈ సీజన్ లోనే జుట్టు ఎక్కువగా పాడవకుండా చూసుకోవాలి..సాధారణంగా
చాలా మంది బయటకి వెళ్ళే తప్పుడు ఫ్యాబ్రిక్ తో చేసిన హాట్స్ పెట్టుకుంటారు...ఇలా
చేయడం వలన జుట్టు మరింతగా బ్రేక్ అయ్యే అవకాసం ఉంటుంది.
చాలా మంది
తల స్నానం చేసిన తరువాత జుట్టు ఆరనిచ్చి తరువాత దువ్వుకోవాలి..ఒక వేళ తడి జుట్టు
మీద దువ్వుకుంటే జుట్టు ఎంతో సులువుగా ఊడిపోతుంది..అందుకే తడి జుట్టుపై ఎక్కువగా
ప్రభావం ఉంచకూడదు వింటర్ సీజన్ లో హెయిర్
క్యూటికల్స్ ఫ్రీజ్ అవుతాయి. దాంతో జుట్టు సరిగా డ్రై అవ్వకుండా ఉంటుంది. దాంతో
జుట్టుకు డ్యామేజ్ అవుతుంది.
వింటర్లో ఓపెన్ హెయిర్ తో బయట తిరగడం వల్ల జుట్టు ఎక్కువ
చిక్కుబడుతుంది. ఈ చిక్కును విడిపించడానికి కష్టం అవుతుంది. బలవంతంగా దువ్వడం వల్ల
జుట్టు బ్రేక్ అవుతుంది...అంతే
కాదు వారానికి సుమారు రెండు సార్లకి మించి తలస్నానం చేయకూడదట
అయితే
ఇంకొక ప్రధానమైన విషయం ఏమిటి అంటే కెమికల్స్ కలిగి ఉన్న షాంపూలు వాడటం వలన జుట్టు
యోక్క సారాన్ని కోల్పోతుంది అంతేకాదు జుట్టు డ్రై అయిపోతుంది..అందుకే సహజసిద్ధమైన
షాంపులు వాడటం ఎంతో ఉత్తమం..చాలా మంది జుట్టుకి ఎలక్ట్రానిక్ పరికరాలకి సంభందించిన
అనేక పరికరాలు వాడుతూ ఉంటారు హెయిర్ డ్రై లాంటివి అస్సలు ఇలాంటివి వాడటం జుట్టు
ఎదుగుదలని ఆపేస్తుంది అని అంటున్నారు ..
చలి కాలంలో వేడి నీళ్ళతో స్నానం చేయడం సాధారణంగా జరుగుతుంది..అయితే ఎక్కువ వేడిగా ఉండే నీళ్ళు తల మీదుగా పోసుకోవడం వలన జుట్టు మరింత డ్రై అవుతుంది..అలా కాకుండా గోరువెచ్చని నీటితో పోసుకోవడం వలన జుట్టు సమస్యలు అధిగవించవచ్చు