జుట్టుకు రంగు రంగుల కలర్స్ వేస్తే జుట్టు ఆకర్షణీయంగా కన్పిస్తుంది. అయితే ఈ కలరింగ్ చేయడానికి ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. రంగు వేయడానికి జుట్టు కావలసిన రీతిలో తీర్చి దిద్దుకోవాలి. అలా చేయకపోతే జుట్టు ఆకారం చెడిపోవడమే కాకుండా వెంట్రుకలు రాలిపోతాయి.
కలరింగ్ వేయడానికి ముందు తీసుకోవాలసిన జాగ్రత్తలు :
జుట్టును శుభ్రంగా కడిగిన తర్వాతే కలరింగ్ వేయాలి. మురికిగా, జిడ్డుగా ఉంటే వెంట్రుకలకు రంగు సరిగా అంటుకోదు. పైగా ఇలా చేసిన రంగు ఎక్కువ కాలం నిలువ ఉండదు. తలమీ ఎక్కడైనా గాయం, పుండు, దురద లాంటివి ఉన్నట్లైతే కలరింగ్ చేయకపోవడమే మంచిది. కలరింగ్ తో జుట్టు కుదుళ్లు బలహీనపడటం, వెంట్రుకలు చిట్లడం జరుగుతుంది.
అందుకే రంగు వేసేముందు జుట్టును ట్రిమ్ చేయించుకోంటే మంచిది. వెంట్రుకలు స్టైటనింగ్, ఫర్మింగ్ లాంటివి కలరింగ్ కు రెండు వారాల ముందే చెయించండి. ఇవన్నీ కెమికల్స్ తో కూడినవి. కాబట్టి ఒక దానికి తర్వాత ఒకటి వెంటవెంటనే చేయిస్తే వెంట్రుకుల సహజత్వాన్ని కోల్పోతాయి. జుట్టుకు హెన్నా పెడితే కలరింగ్ చేయించకూడదు.
ఎందుకంటే హెన్నా ప్రభావం ఉన్నంతవరకు కలర్ అంటుకోదు. కాబట్టి హెన్నా తీసేశాకే కలరింగ్ చేయాలి. హెయిర్ డైలో కొత్తబ్రాండ్ ను వాడేముందు మీ మోచేయి దగ్గర ఆ రంగును అద్ది 15-20 నిమిషాలు ఉంచి కడిగేసినట్లైతే ఆ ప్రదేశంలో ఎలాంటి ఇన్ఫెక్షన్ కానీ, దురద, మంటపుట్టటం వంటివి లేనట్లైతే కలరింగ్ ను మీరు దారాళంగా ఉపయోగించవచ్చు.
మరింత సమాచారం తెలుసుకోండి: