ఒక వ్యక్తి ఆకర్షణీయంగా కనిపించేలా చేయడంలో శిరోజాల పాత్ర చాలా కీలకం. కానీ ఆ శిరోజాలే కుప్పలు కుప్పలుగా ఊడిపోతూ బట్టతల వచ్చేస్తుంటే ఆ వ్యక్తి పడే బాధ చెప్పనలవి కాదు. అయితే వీరికి జుట్టు కుదుళ్లను పునరుత్తేజం చేసే స్టెమ్ సెల్ థెరపీ, సెల్యులార్ మెడిసిన్ లతో పరిష్కారం లభిస్తుందని అంటున్నారు కాస్మెటాలజిస్ట్ బి.ఎన్.రత్న.
ఆండ్రోజెనిక్ అలోపిసియా :
స్త్రీ, పురుషుల్లో ఉండే టెస్టొస్టెరాన్ హార్మోన్ కెమికల్ రీయాక్షన్ ద్వారా డీహెచ్‌టీగా మారుతుంది. దీనివల్ల తలలోని జుట్టు కుదుళ్లపై దాడి చేయడం ప్రారంభమై కుదుళ్లను కొద్దికొద్దిగా నాశనం చేస్తుంది. దీనికోసం డీహెచ్‌టీ కుదుళ్లకు వెళ్లి రక్తప్రసరణపై, కుదుళ్ల ఎదుగుదలకు కావాల్సిన సిగ్నల్స్‌ను కుదుళ్లకు చేరకుండా నియంత్రిస్తుంది. దీనివల్ల జుట్టు రోజురోజుకు పలచబడి, చివరికి రాలిపోతుంది. ఈ సమస్య తలెత్తినపుడు స్టెమ్‌సెల్ ఇంజక్షన్ తీసుకోవటం వల్ల గ్రోత్ ఫ్యాక్టర్స్ దెబ్బతిన్న, కుచించుకుపోయిన జుట్టు కుదుళ్లకు రక్తప్రసరణ ద్వారా మళ్లీ జుట్టు ఎదుగుదల సిగ్నల్స్‌ను అందజేయడం ద్వారా మళ్లీ అవి పునరుత్తేజం అవుతాయి.
టెలోజెన్ ఎఫ్లూవియమ్ :
స్త్రీలలో జుట్టు రాలటానికి, జుట్టు పలచబడటానికి హైపో థైరోడిజమ్ కారణమని చెప్పవచ్చు. ఇది 60 నుంచి 80 శాతం మంది మహిళల జుట్టు పలచబడటానికి కారణం అవుతుంది. ఉద్వేగం, హై ఫీవర్, మేజర్ ఆపరేషన్‌లు, రక్తహీనత, దీర్ఘకాలిక అనారోగ్యం కారణమవుతున్నాయి.
అలోపిసియా అరెటా :
ఆటో ఇమ్యూ డిజార్డర్ వల్ల జట్టు రాలుతుంది. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ జుట్టు కుదుళ్లను శత్రువులాగా భావించి వాటిని నాశనం చేస్తుంది. ఇలాంటి వారు కోర్టికో స్టెరాయిడ్ ఇంజక్షన్ చేయించుకోవటం ద్వారా మళ్లీ జట్టు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. చికిత్స జుట్టు రాలటానికి గల కారణాన్ని తెలుసుకొని, దానిపై లోతుగా విశ్లేషించి మెరుగైన చికిత్స చే యాలి. టెస్టొస్టెరాన్ హార్మోన్, హైపో థైరోసిజం తగ్గించడానికి అంతర్గతంగా మందులు ఇవ్వాలి. కుచించుకు పోయిన జుట్టు కుదుళ్లకు రక్తసరఫరా పెంచడానికి లోషన్, హెర్బల్ ఆయిల్స్‌తో స్కాల్ప్‌థెరపీ చేయాలి.
స్టెమ్‌సెల్ థెరపీ మన శరీరంలోని రక్తకణాలు, నాడీ కణాలను వేరు చేసి చూపించగల సామర్ధ్యం మూల కణాలకు మాత్రమే ఉంటుంది. శరీరంలో అంతర్గత మరమ్మతు వ్యవస్థగా మూలకణాలు పనిచేస్తాయి. మొదటి దశలో వివిధ హెర్బల్ ఆయిల్స్ థెరపీ ద్వారా కుదుళ్లను ఉత్తేజపర్చవచ్చు. రెండవ దశలో స్టెమ్ సెల్స్‌ను తలలోకి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. వివిధ కారణాల వల్ల శుష్కించుకుపోయిన జుట్టుకుదుళ్లు ఈ చికిత్సతో శక్తివంతమై మళ్లీ జుట్టు మొలకెత్తుతుంది.
స్టెమ్‌సెల్స్ శిరోజాలను బాగా పెంచటంతోపాటు మందంగా ఉండేందుకు తోడ్పడతాయి. ఇవి కొత్త బ్లడ్ వెసెల్స్‌ను ఏర్పరచి శిరోజాల వృద్ధికి ఉపకరిస్తాయి. మెసో థెరపీ ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా అనేది రక్తంలో కనిపించే ప్లేట్‌లెట్ మిశ్రమంతో కూడిన బ్లడ్ ప్లాస్మా. ఇది రోగి శరీరంలో నుంచి తీస్తారు. ఇది సర్జరీకి ముందు రోగి తన రక్తాన్ని తన కోసమే దానం చేయడం లాంటిది. ఈ ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా మిశ్రమానికి గ్రోత్ ఫ్యాక్టర్స్‌ను మిక్స్ చేసి తలలోకి ఇంజెక్ట్ చేయడం ద్వారా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. దుష్ఫలితాలకు దూరం స్టెమ్‌సెల్ థెరపీ, మెసో థెరపీ చికిత్సల వల్ల ఎలాంటి దుష్ఫలితాలు ఉండవు.
జుట్టు మొలవటంతోపాటు ఫంగల్, దురద లాంటి ఇన్ఫెక్షన్‌లు కూడా నయమవుతాయి. డైరెక్ట్ హెయిర్ ఇంప్లాంటేషన్ బట్టతల 6 లేదా 7 వ దశలో ఉన్న వారికి నేరుగా జుట్టును ఇంప్లాంట్ చేసే పద్ధతి వరంగా మారింది. ఈ విధానంలో స్ట్రిప్ కట్ చేయడం, రూట్స్ కల్చర్ చేయడం లాంటివి ఉండవు. బట్టతల ఉన్న వ్యక్తికి అతని తల వెనుక భాగంలో ఉన్న వెంట్రుకలను మిషన్ ద్వారా తీసి నేరుగా ఇంప్లాంట్ చేయవచ్చు. ఈ పద్ధతి మొత్తం యంత్రం ద్వారా చేయడం వల్ల ఒక్క రూట్ కూడా వృథా కాదు. ఈ పద్ధతిలో రోజుకు 1500 వెంట్రుకల కుదుళ్లను ఇంప్లాంట్ చేయవచ్చు.
మరింత సమాచారం తెలుసుకోండి: