అందమైన మోము- పెదవుల కోసం

Durga
అందమైన పెదవుల కోసం : పెదవులు అందంగా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి... కానీ ఈ రోజుల్లో మనం తీసుకునే ఆహారం లో వచ్చిన మార్పులు, నిద్రలేమి, ఎక్కువ గాఢత కలిగిన క్రీములు, రక్తహీనత వల్ల కూడా పెదవులు పాడవుతున్నాయి. పెదవులు తోలు ఊడిపోయి, చివరలు పగిలి, నల్లగా కళావిహీనంగా తయారవుతున్నాయి. కొద్దిపాటి ఖర్చు తోనే మనం ఈ సమస్యను అధిగమించవచ్చు. నాకు తెలిసిన, మన పూర్వీకుల నుండీ వస్తున్న ఒక మంచి ఆయుర్వేద చిట్కా ను మీకు కూడా చెప్పబోతున్నాను. ఆయుర్వేదం కూడా వేదాలలో ఒక భాగమే…అదేమిటో తెలుసుకుందాం ఈ చిట్కాలో..  కావలసిన పదార్ధాలు... జాజికాయ - 50గ్రా, పాలు- సరిపడా, దంచిన పసుపు - 50గ్రా, నాటు ఆవు నెయ్యి - 50గ్రా. జాజికాయలను పగలగొట్టి పై బెరడుని దంచి పొడి చేయాలి. తరువాత స్టౌవ్ వెలిగించి, ఒక గిన్నె లో పాలు పోసి పైన వస్త్రం కట్టాలి. ఈ వస్త్రం లో జాజికాయపొడిని వేయాలి. ఇలా ఒక 10నిమిషాలు ఉంచి, తీసి ఈ పొడిలో పసుపు కలిపి, గాజు సీసాలో నిల్వ చేసుకుని, పెదవులు నల్లగా ఉన్నవారు, పొక్కులు వచ్చిన వారు, అంచులు పగిలిన వారు రాత్రిపూట మాత్రమే నెయ్యిలో ఈ పొడిని తీసుకుని బాగా రంగరించి, పెదవులకు పట్టించి మృదువుగా మర్దనా చేయండి. దీనివల్ల పెదవులు తేనెలూరుతూ, ఎర్రగా నిగనిగలాడతాయి. అందమైన మోము కోసం : ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న సమస్య "మొటిమలు".వీటి నివారణకు ఈ చిట్కాను తెలుసుకుందాం... గులాబి, బచ్చలి ఆకులను తీసుకుని మెత్తగా రుబ్బి మొటిమల మీద రాస్తూ ఉంటే పదిహేను రోజుల్లోనే తేడాను గమనించవచ్చు. 1. అందమైన మోము కోసం పచ్చిపాలతో.. ముఖం తెల్లగా ఉండాలని అందరికీ ఆశ గా ఉంటుంది.కానీ ఉన్న రంగులోనే ముఖం ఇంకొంచెం ఛాయ పెరిగేలా, ముఖం నునుపు గా వచ్చేలా చేయొచ్చు. అదేంటో తెలుసుకుందాం  ఈ చిట్కా లో.. పచ్చిపాలు, మంచి గంధం సరిపడా తీసుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మాత్రమే కాక, మెడకు, చేతులకు పట్టించి ఆరాక చల్ల నీటితో కడిగేయండి. ఇది క్రమం తప్పకుండా ఒక నెల రోజులు వాడి చూడండి... తేడా మీకే తెలుస్తుంది. ఇది ముఖానికి పట్టించి, ముఖాన్ని కడిగేశాక ముఖం ఎంత మెరుపు, నునుపును సంతరించుకుంటుందో తెలియాలంటే "మన అమ్మ" చిట్కాను పాటించి మీరంతా అందంగా తయారవుతారని ఆశిస్తున్నాను. 2) అందమైన మోము కోసం:  టొమాటో, బీట్రూట్, క్యారట్...సౌందర్య చిట్కా- అందమైన మోము కోసం. ఇంట్లో దొరికే కూరలతోనే ఒక అద్భుతమైన ఫేస్ ప్యాక్ మీ కోసం ఈ చిట్కా లో.. టొమాటో, బీట్రూట్, క్యారట్ ఈ మూడిటిని మెత్తటి ముద్దచేసి, అందులో కొంచెం పాలమీగడ వేసి బాగా రుబ్బి, వీలు దొరికినప్పుడల్లా ఈ ఫేస్ ప్యాక్ ను పట్టించటం వల్ల ముఖం కాంతివంతంగా, ప్రకాశవంతంగా ఉంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: