ఈ రైతులకి షాక్.. రూ.2000 /- రావు?

Purushottham Vinay
ఈ రైతులకి షాక్.. రూ.2000 /-  రావు?

దేశంలోని కొన్ని కోట్లాది మంది రైతులకు త్వరలో చక్కటి శుభవార్త అనేది అందనుంది. ఎందుకంటే ప్రభుత్వం 13వ విడత పీఎం కిసాన్ యోజనను బ్యాంక్ అకౌంట్ కి బదిలీ చేయబోతోంది.ఇక మార్చి నెలలో రైతుల ఖాతాల్లోకి డబ్బులు వస్తాయని అందరు కూడా భావిస్తున్నారు. ఈ పథకం ద్వారా మొత్తం 14 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూర్చగా ఈసారి చాలా మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో  మొత్తం 2 వేల రూపాయలు జమకావడం లేదు. ఎందుకంటే వాటికి సంబంధించిన అనర్హుల జాబితాను ప్రభుత్వం తయారు చేసింది. మీరు కూడా ఖచ్చితంగా ఈ జాబితాలోని పేరును చెక్‌ చేసుకోవాలి. ఇంకా ఏదైనా సమస్య కనుక ఉంటే ప్రభుత్వం జారీ చేసిన నంబర్‌ని ఖచ్చితంగా మీరు సంప్రదించాలి.ఇక మీరు ఇంకా E-kyc కనుక పూర్తి చేయకుంటే వెంటనే చేయండి. 


లేదంటే మీ ఖాతాలో డబ్బులు జమకావు. ఇక మీరు ఈ KYCని రెండు విధాలుగా చేయవచ్చు.దీనిని ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో చేయవచ్చు. అయితే దీని కోసం మీరు ఖచ్చితంగా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. మరీ ముఖ్యంగా మీ బ్యాంక్ ఖాతాతో ఆధార్‌నుఖచ్చితంగా లింక్ చేయాలి.ఇంకా భూమికి సంబంధించిన ల్యాండ్ వెరిఫికేషన్ చేసుకోని వారు వెంటనే ఈ పనిని ఖచ్చితంగా పూర్తి చేయండి.ఇక ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 13వ విడత అనేది అసలు ఆగిపోకూడదని ప్రభుత్వం చాలా ఆందోళన చెందుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్న రైతులు అధికారిక ఇమెయిల్ ఐడి ద్వారా సంప్రదించవచ్చు. దీనికి ఇంకా ఈజీ పరిష్కారం ఏంటంటే ఇది కాకుండా హెల్ప్‌లైన్ నంబర్‌కు కూడా మీరు కాల్ చేయవచ్చు. 155261 లేదా 1800115526 (టోల్ ఫ్రీ) లేదా 011-23381092 ఈ నంబర్స్‌కి కాల్‌ చేసి సమస్య గురించి మీరు విన్నవించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: