బ్యాంకులో డబ్బులు ఆదా చేసేవారు ఇవి తెలుసుకోండి?

Purushottham Vinay
ఇక చాలా బ్యాంకులు కూడా ఈమధ్య కాలంలో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచేశాయి.ఈ రేట్లు పెంపు తర్వాత ఎఫ్‌డీలు గతంలో కన్నా కాస్త ఎక్కువ రాబడిని అందిస్తున్నాయి. అయితే ఇప్పటకీ కూడా స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ ఆకర్షణీయ రాబడిని అందిస్తున్నాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) సహా స్కీమ్స్‌లో వడ్డీ రేట్లు బ్యాంక్ ఎఫ్‌డీల కన్నా ఎక్కువే ఉన్నాయి.పీపీఎఫ్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, సుకన్య సమృద్ధి స్కీమ్ వంటివి 7.6 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. మరోవైపు పీఎన్‌బీ, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు మాత్రం ఎఫ్‌డీలపై దాదాపు 6 శాతం వడ్డీని అందిస్తున్నాయి.చిన్న మొత్తాల పొదుపు పథకాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తూ వస్తోంది. ప్రజలు రెగ్యులర్‌గా పొదుపు చేసుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ సదుపాయం అందుబాటులో ఉంచింది. చాలా రకాల సేవింగ్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి.వీటిల్లో కొన్ని పోస్టాఫీస్ సేవింగ్ డిపాజిట్లు, 1 నుంచి 3 ఏళ్ల టెన్యూర్‌తో టైమ్ డిపాజిట్లు, ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్లు వంటివి ఉన్నాయి. నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్స్, కిసాన్ వికాస్ పత్ర వంటి సేవింగ్ సర్టిఫికెట్స్ కూడా ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు.ఇంకా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి స్కీమ్, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ వంటి వాటిని సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్‌గా చెప్పుకోవచ్చు.


అలాగే మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ కూడా ఈ చిన్న మొత్తాల పొదుపు పథకాల కిందకే వస్తుంది.కేంద్ర ప్రభుత్వం చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వచ్చే నెలలో  వడ్డీ రేట్లు పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి.పోస్టాఫీస్ సేవింగ్స్ డిపాజిట్లపై 4 శాతం వడ్డీ వస్తుంది. ఏడాది నుంచి మూడేళ్ల టెన్యూర్‌లోని టైమ్ డిపాజిట్లపై 5.5 శాతం వడ్డీ పొందొచ్చు. ఐదేళ్ల టైమ్ డిపాజిట్లపై 6.7 శాతం వడ్డీ ఉంది. ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్‌పై అయితే 5.8 శాతం వడ్డీ వస్తుంది.నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్స్, కిసాన్ వికాస్ పత్ర వంటి వాటిపై వడ్డీ రేటు వరుసగా 6.8 శాతంగా, 6.9 శాతంగా ఉన్నాయి. పీపీఎఫ్‌పై వడ్డీ రేటు 7.1 శాతం. సుకన్య సమృద్ధి పథకంపై 7.6 శాతం వడ్డీని పొందొచ్చు. అలాగే సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌పై వడ్డీ రేటు 7.4 శాతంగా ఉంది. మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌పై వడ్డీ రేటు 6.6 శాతంగా ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 2.9 శాతం నుంచి 5.65 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది. సాధారణ కస్టమర్లకు ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి. టెన్యూర్ ప్రాతిపదికన రేట్లు మారతాయి.హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అయితే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 2.75 శాతం నుంచి 6.1 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) అయితే ఎఫ్‌డీలపై 3 శాతం నుంచి 5.75 శాతం వడ్డీని అందిస్తోంది. రూ. 2 కోట్లలోపు డిపాజిట్లకు ఈ రేట్లు వర్తిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: