క్రెడిట్ కార్డ్ ను ఇలా వాడితే డబ్బులు ఆదా చేసుకోవచ్చు..ఎలాగంటే?

Satvika
ముందుగా డబ్బులు వాడుకొని నెలాఖరున డబ్బులు కట్టే సదుపాయం కేవలం క్రెడిట్ కార్డు ఉన్నవాళ్లకు మాత్రమే ఉంటుంది. అయితే కొన్ని ఇంట్రెస్ట్ ఎక్కువగా తీసుకుంటాయి. అలా ఊరికే క్రెడిట్ కార్డు ను ఎలా పడితే అలా వాడకుండా చాలా పొదుపుగా వాడుకోవాలని సూచిస్తున్నారు. మరి ఇలా కనుక క్రెడిట్ కార్డ్ ను వాటితే అదనపు చార్జీలు పడవట అవేంటో చూద్దాం..

క్రెడిట్ కార్డును జాగ్రత్తగా వాడితే క్రెడిట్ స్కోరును పెంచుకోవచ్చు. మన స్థోమతకు తగ్గట్టుగా మాత్రమే కొనుగోలు చేసి.. ప్రతి నెలా సకాలంలో బిల్లులు చెల్లించడం ముఖ్యం. క్రెడిట్ కార్డు ద్వారా అప్పుల ఊబిలో చిక్కుకోవద్దంటే ఇదొక్కటే మార్గం. ఎప్పటికప్పుడు బిల్లును పూర్తిగా సకాలంలో చెల్లించాలి. కాస్త ఆలస్యమైనా లేట్ పేమెంట్ రూపంలో భారీగా ఛార్జీలు కట్టాల్సి వస్తుంది. పేమెంట్ హిస్టరీపై క్రెడిట్ స్కోరు ఆధారపడి ఉంటుంది. చెల్లింపులు ఆలస్యమైతే మీ స్కోరుపై ప్రభావం పడుతుంది..

క్రెడిట్ కార్డును మీ బడ్జెట్ పరిమితులకు అనుగుణంగా వాడుకోవచ్చు. క్రెడిట్ కార్డు కొనుగోళ్ల ద్వారా రివార్డు పాయింట్లను సైతం పొందొచ్చు. క్రెడిట్ కార్డు వాడకాన్ని జాగ్రత్తగా గమనించడం కోసం వారానికి లేదా రెండు వారాలకోసారి మీ క్రెడిట్ కార్డు ఖర్చులను ఆన్‌లైన్లో‌ పరీక్షించుకోవాలి..క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు జరిపేటప్పుడు చాలా మంది ఎక్కువగా ఖర్చు చేసేస్తుంటారు. మీరు కూడా ఇలాగే ఎక్కువ ఖర్చు చేస్తున్నారనుకుంటే.. మీ క్రెడిట్ లిమిట్ తగ్గించాలని క్రెడిట్ కార్డు కంపెనీని కోరవచ్చు. లిమిట్ దాటే వరకు ఉంటే మరో నెల వరకు క్రెడిట్ కార్డు వాడక పోవడమే మంచిది.

క్రెడిట్ కార్డు రివార్డుల పట్ల మీకు ఆసక్తి లేకపోయినప్పటికీ.. ఇతర ప్రయోజనాలు పొందొచ్చు. కొన్ని క్రెడిట్ కార్డులతో ఉచితంగా ట్రావెల్ ఇన్సూరెన్స్, ప్రైస్ ప్రొటెక్షన్ పొందొచ్చు. అదనంగా వారంటీలు పొందడం, ఈ-కామర్స్ సైట్లలో ప్రత్యేకంగా డిస్కౌంట్లు పొంద వచ్చు .. ఇవే కాకుండా రివార్డులు కూడా అందుకోవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: