భారీగా పెరగనున్న ఎల్‌పి‌జి గ్యాస్ ధరలు..!!

KISHORE
 సామాన్యులకు పిడుగు లాంటి వార్తా వినిపించాయి ఇండియన్ చమురు సంస్థలు. వంటింటి గ్యాస్ మీద ఈ సారి భారీగా ధరలు పెంచనున్నారు,దీంతో సామాన్యునిపై అదనపు భారం పడనుంది.ఎప్పటికే పెట్రోల్,డీసెల్,ధరలు ఆకాశానంటూతున్నాయి.దీంతో ప్రజలు నిత్యం అవసరాల కోసం  వాహనాల వాడకం తప్పకపోవడంతో ప్రజల జేబులు ఖాళీ అవుతున్నాయి.అంతే కాకుండా నిత్యవసర సరుకుల ధరలు కూడా బగ్గుమంటున్నాయి.
దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.అయితే మళ్ళీ ఇప్పుడు వంట గ్యాస్ ధరలు కూడా పెరగనుండడంతో అంధోలన చెందుతున్నారు.గ్యాస్ వినియోగించుకునే వారికి ఈ వార్తా పిడుగులాంటిదనే చెప్పాలి.ఒక్క సిలిండర్ కి ఉన్న రేటు కంటే 50 రూపాయలు అదనంగా పెంచుతున్నట్టు నిర్ణయం తీసుకున్నాయి చమురు సంస్థలు.
దీంతో సామాన్యునిపై మళ్ళీ అధిక భారం పడినటైంది.అయితే ఎల్‌పి‌జి గ్యాస్ ధరలు ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది,ప్రస్తుతం డిల్లీలో 599 రూపాయలు వున్న ఒక్క్ సిలిండర్ 649 రూపాయలకు పెరిగింది.అదే విధంగా దేశమంతట ఒకే ధర ను నిర్ణయిస్తారా లేక వివిధ రాష్ట్రాలలో వివిధ ధరలతో అమలుపరుస్తారా అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు.ఎనేమైనా ఎల్‌పి‌జి ధరలు పెరిగితే మాత్రం మరొకసారి సామాన్యుకి నిత్యవసర ధరలు కంటికి నీళ్ళు తెప్పించడం ఖాయంగా కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: