భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్...!
ఇక నేడు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (నిఫ్టీ) లో ఫార్మా, మెటల్, ఎఫ్ఎంసిజి ఇండెక్స్ లు నష్టపోగా మిగతా ఇండెక్స్ లు లాభాల్లో ముగిశాయి. ఇక నేడు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి లో అత్యధిక లాభాలు, నష్టాలు పొందిన షేర్ల విషయానికి వస్తే.. ముందుగా అత్యధికంగా లాభపడిన వాటిలో హెచ్డిఎఫ్సి బ్యాంక్, టాటా మోటార్స్, ఇందుస్ ల్యాండ్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీల షేర్లు లాభాల పడిన వాటిలో ముందంజలో ఉన్నాయి. ఇందులో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏకంగా 8.3 శాతం పైగా లాభపడింది. ఇక అత్యధికంగా నష్టపోయిన షేర్ల విషయానికి వస్తే బ్రిటానియా, కోల్ ఇండియా, టాటా స్టీల్, హిందాల్కో, విప్రో కంపెనీలు అత్యధికంగా నష్టపోయిన లిస్టులో ముందుగా ఉన్నాయి. ఇందులో బ్రిటానియా కంపెనీ అత్యధికంగా 1.6 శాతం పైగా నష్టపోయింది.
ఇక నగదు విభాగానికి వస్తే.. విదేశీ ఫోర్ట్ పోల్ లో ఇన్వెస్టర్లు 237 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగా, మరో వైపు దేశి వారు 472 కోట్ల విలువైన షేర్ల అమ్మకాలను చేపట్టారు. ఇక నేడు హైదరాబాద్ లో నేటి బంగారం ధరలు విషయానికి వస్తే.. 24 క్యారెట్లు 10 గ్రాములకు 470 పెరిగి రూ. 52,850 కి చేరుకోగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 430 రూపాయలు పెరిగి 48,450 రూపాయలకు చేరుకుంది. అలాగే కేజీ వెండి ధర ఏకంగా 13 వందల రూపాయలు పెరిగి చివరికి 62000 వద్ద ముగిసింది.