రిలయన్స్ లోకి వెల్లువెత్తుతున్న పెట్టుబడులు...!

Suma Kallamadi
ప్రపంచవ్యాప్తంగా గత ఎనిమిది నెలల నుండి కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దిగ్గజ కంపెనీలు తీవ్ర ఆర్థిక సమస్యలతో ఎన్నో కంపెనీలు మూతపడ్డాయి కూడా. ఓవైపు పరిస్థితి అలా ఉంటే భారతదేశంలో మాత్రం రిలయన్స్ ఇండస్ట్రీస్ సంబంధించిన వ్యాపారం అంచలంచలుగా ముందుకు సాగుతోంది. వివిధ దేశాల్లోని వివిధ దిగ్గజ కంపెనీలు రిలయన్స్ ఇండస్ట్రీ లో పెట్టుబడి పెట్టేందుకు క్యూ కడుతున్నాయి.

ఇదివరకు రిలయన్స్ ఇండస్ట్రీకి సంబంధించిన రిలయన్స్ జియో సంస్థలో ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఫేస్బుక్, గూగుల్ లాంటి దిగ్గజ కంపెనీలు వేల కోట్లతో కంపెనీ లో వాటాలను కొనుగోలు చేశాయి. దీంతో రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ ఆస్తులు విలువ అమాంతం పెరిగిపోయింది. ఇక తాజాగా రిలయన్స్ గ్రూపుకు చెందిన రిటైల్ వ్యాపార వెంచర్స్ లో ఒకటైన రిలయన్స్ రిటైల్ వ్యాపారంలో కూడా పెట్టుబడులు ఒకదాని వెనుక ఒక కంపెనీ పెట్టడానికి ఉత్సాహం చూపిస్తున్నాయి.

ఇందులో భాగంగానే తాజాగా రిలయన్స్ సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థ అయిన gic ఏకంగా రూ. 5512 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఈ పెట్టుబడితో 1.2 శాతం వాటాను దక్కించుకోబోతోంది. అలాగే మరో కంపెనీ టిపిజి కూడా రిలయన్స్ రిటైల్ వెంచర్ లో ఏకంగా రూ. 1837 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి 0.4% వాటాను దక్కించుకుంది. ఇదివరకు రిలయన్స్ జియో కు సంబంధించి కూడా టిపిజి సంస్థ ఏకంగా రూ 4546 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఈ కంపెనీల కాకుండా మరికొన్ని కంపెనీలు కూడా రిలయన్స్ ఇండస్ట్రీ లో పెట్టుబడి పెట్టేందుకు క్యూ కడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ సంబంధించి అనేక వ్యాపార లావాదేవీలు అనేక సంస్థలతో ముందుకు సాగుతున్నాయి. ఏదేమైనా ఒక భారతదేశ కంపెనీల ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందడం నిజంగా అభినందించదగ్గ విషయమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: