మరోబాదుడు..గ్యాస్ పై రూ.2 పెంపు..!

Edari Rama Krishna
ఈ మద్య చమురు, గ్యాస్ విషయాల్లో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది.  సామాన్యులకు ఎంతో భారంగా మారుతున్నా ప్రభుత్వం మాత్రం సబ్సిడీ ఇస్తున్నామంటూనే రేట్లు పెంచుతో పోతున్నారు.  ఇక పెట్రోలో, డీజిల్ విషయంలో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఒకేసారి రేట్లు పెంచి ఒక్కపైసా తగ్గిస్తున్నాం..రెండు పైసలు తగ్గిస్తున్నామంటూ కాకమ్మ కథలు చెబుతున్నారు.  ఇదిలా ఉంటే..వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ.2.34 పెంచాయి, ప్రభుత్వరంగ ఇంధన సంస్థలు.

దీంతో ఢిల్లీలో 14.2 కిలోల సబ్సిడీ సిలిండర్ ధర రూ. 491.21 నుంచి రూ. 493.55కు పెరిగింది. ముంబైలో రూ. 491.31, కోల్‌కతాలో రూ. 491.21లకు చేరుకున్నది. కాగా, సబ్సిడీ లేని సిలిండర్ ధరను ఏకంగా రూ. 48.50 మేర పెంచారు. దీంతో నాన్ సబ్సిడి సిలిండర్ ధర రూ. 698.50కి చేరుకున్నది.

ప్రతియేటా ఏటా 12 సిలిండర్లను సబ్సిడీ ధరకు వినియోగదారులకు సరఫరాచేస్తున్నది. అంతకు మించి వినియోగించే సిలిండర్లకు నాన్ సబ్సిడీ ధరను చెల్లించాల్సి వుంటుంది. కాగా, లీటర్ కిరోసిన్ ధరను 26 పైసల మేర పెంచారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: