ఇవాళ పాలమూరులో బీజేపీ నిరుద్యోగ మార్చ్‌?

Chakravarthi Kalyan
ఉమ్మడి పాలమూరు జిల్లా కేంద్రంలో ఇవాళ జరగబోయే నిరుద్యోగ మార్చ్ కు పెద్ద ఎత్తున తరలిరావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తుకు సంబందించి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సీఎం స్పందించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని..  సిట్టింగ్ జడ్జితో విచారణ జరపడంతోపాటు ఐటీ శాఖ మంత్రిని బర్తరఫ్ చేసేదాకా, నిరుద్యోగులకు రూ. లక్ష పరిహారం ఇచ్చేదాకా తమ పోరాటం కొనసాగుతుందని బండి సంజయ్ స్పష్టం చేశారు.

కేసీఆర్ ప్రభుత్వం గత 8 ఏళ్లుగా నిరుద్యోగుల గొంతు కోస్తోందని బండి సంజయ్  మండిపడ్డారు. బిశ్వాల్ కమిటీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. వాటిని భర్తీ చేస్తానని గతంలో చెప్పిన సీఎం కేసీఆర్ ఆ తరువాత మాట మార్చి అసెంబ్లీ వేదికగా 80 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారని.... కానీ నేటికీ ఒక్క ఉద్యోగం భర్తీ చేయకుండా కాలయాపన చేస్తోందని బండి సంజయ్  విమర్శించారు. 21 నోటిఫికేషన్లు విడుదల చేసినా ఏ ఒక్కటీ సక్రమంగా నిర్వహించలేదని బండి సంజయ్  అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: