ఆదాయంలో తెలంగాణ కొత్త రికార్డులు?

Chakravarthi Kalyan
తెలంగాణ రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ రాబడులు 70వేల కోట్ల మార్కును దాటిందని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 70 వేల కోట్ల మార్కును అధిగమించడంపై ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్, అధికారుల బృందాన్ని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అభినందించారు. వాణిజ్యపన్నుల శాఖకు సిస్టం బేస్డ్ మాడ్యూల్స్ అందించినందుకు ఐఐటీ హైదరాబాద్, కోఆర్డినేటర్ శోభన్ బాబు నేతృత్వంలోని బృందాన్ని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రత్యేకంగా ప్రశంసించారు.

వాణిజ్య పన్నులశాఖ అధికారులు ఇన్నోవేషన్లు అమలు చేయడంలో ఇవి కీలకంగా మారాయని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. నెలాఖరు లోపు వాణిజ్యపన్నుల శాఖ రాబడులు 72వేల కోట్ల లక్ష్యాన్ని చేరుకుంటాయని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: