ఆ విషయంలో కేసీఆర్‌ సూపర్‌?

Chakravarthi Kalyan
రాష్ట్రంలో అకాల వర్షాలు, వడగండ్ల వానల ప్రభావంతో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనను రైతు స్వరాజ్య వేదిక స్వాగతించింది. రైతు ఉద్యమాల ఫలితంగా వచ్చిన సీఎం ప్రకటనను స్వాతిస్తున్నామని తెలిపింది. కౌలు రైతుల ప్రస్తావన రావడం పట్ల కూడా ఆ వేదిక సంతోషం వ్యక్తం చేసింది. గత మూడేళ్లుగా దేశంలో ఎలాంటి పంట బీమా పథకం లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని రైతు స్వరాజ్య వేదిక ఆక్షేపించింది. అదే సమయంలో ప్రభుత్వం... జాతీయ నిర్వహణ చట్టం 2005 ప్రకారం బాధిత రైతులకు అవసరమైన పెట్టుబడి రాయితీ ద్వారా ఏ విధమైన విపత్తు సహాయ సహకారం అందించడం లేదని రైతు స్వరాజ్య వేదిక తీవ్రంగా తప్పుపట్టింది.

ఇక నుంచి ప్రతి సంవత్సరం జరిగే అన్ని ప్రకృతి విపత్తుల్లో కూడా ఎకరాకు 10 వేల రూపాయలు విపత్తు సహకారంతోపాటు కౌలు రైతులను చేర్చుకోవడాన్ని తెలంగాణ ప్రభుత్వం విధాన నిర్ణయంగా ప్రకటించాలని రైతు స్వరాజ్య వేదిక విజ్ఞప్తి చేసింది. మూడేళ్లుగా నష్టపోయిన రైతులకు విపత్తు సహాయ సహకారాలు అందించాలని రైతు స్వరాజ్య వేదిక పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: