బీఆర్‌ఎస్‌లోకి కన్నా లక్ష్మీనారాయణ?

Chakravarthi Kalyan
సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఆయన టీడీపీలో చేరతారని అంటున్నారు. కానీ.. కన్నాను బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానిస్తున్నారు ఏపీ బీఆర్‌ఎస్‌ నేతలు. కన్నా బిజెపి రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నప్పుడు నేను అదే పార్టీలో ఉన్నానని ఏపీ బీఆర్ఎస్‌ నేత రావెల కిషోర్‌ బాబు గుర్తు చేసుకున్నారు. వైసీపీ సర్కారుకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశామని.. అమరావతి ఉద్యమంలో కన్నాతో కలిసి పాల్గొన్నానని.. సోము వీర్రాజు అధ్యక్షుడయ్యాక పోరాటాలు లేవని ఏపీ బీఆర్ఎస్‌ నేత రావెల కిషోర్‌ బాబు అన్నారు.
సోము వీర్రాజును భరించలేకే నేను ముందుగానే బిజెపి నుంచి బయటకొచ్చానని.. ఇప్పుడు కన్నా లక్ష్మినారాయణ కూడా రాజీనామా చేశారని.. సోము వైఖరితో ఏపీలో బిజెపి త్వరలో ఖాళీ అవుతుందని ఏపీ బీఆర్ఎస్‌ నేత రావెల కిషోర్‌ బాబు అన్నారు. కన్నాను బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నానని రావెల కిషోర్‌ బాబు గుంటూరులో అన్నారు. తెలంగాణా సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: