అమ్మాయిలకు డ్రగ్స్ అలవాటు చేయడం.. ఆపై రేప్‌ చేయడం?

Chakravarthi Kalyan
ముంబయిలో కొన్ని ముఠాలు యువతులకు మాదక ద్రవ్యాలు అలవాటు చేసి లైంగిక దాడి చేస్తున్నాయట. హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఈ వివరాలు తెలిపారు. ముంబయి నుంచి హైదరాబాద్ కు మాదక ద్రవ్యాల సరఫరా ఎక్కువగా జరుగుతోందట. ఆ రాష్ట్ర పోలీసుల సహకారంతో డ్రగ్స్‌ సరఫరాను అడ్డుకుంటామని సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తూ విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్‌ వివరించారు.
ఈ ముఠా నుంచి 204 గ్రాముల ఎండీఎంఏను ఓ కారును సీజ్‌ చేసినట్లు సీపీ సీవీ ఆనంద్‌  తెలిపారు. ముంబయిలో మరో గ్యాంగ్‌ను అరెస్టు చేశామని.. ఏపీ నుంచి ముంబైకి గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నామని.. వీరి నుంచి 110 కిలోల గంజాయిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సీజ్ చేసినట్లు సీపీ సీవీ ఆనంద్‌ చెప్పారు. ఈ కేసులో భార్య భర్తలిద్దరు పరారయ్యారని.. వీరి  కోసం గాలిస్తున్నట్లు సీపీ సీవీ ఆనంద్‌ పేర్కొన్నారు.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: