వీహెచ్‌ చేస్తున్న మంచి పని.. పొగిడేసిన రేవంత్‌?

Chakravarthi Kalyan
మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంతురావు 40వ రాజీవ్ గాంధీ ఆల్ ఇండియా, అండర్‌-19 క్రికెట్ ఛాంపియన్ షిప్ 2023 పోటీలు నిర్వహించడం అభినందనీయమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. ఎన్నో ఇబ్బందులుఉన్నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో హనుమంతరావు సంపాదించిందేమీ లేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. 40వ రాజీవ్ గాంధీ ఆల్ ఇండియా, అండర్‌-19 క్రికెట్ ఛాంపియన్ షిప్ 2023 పోటీలు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో వీహెచ్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. రాజీవ్ గాంధీ 40వ అఖిల భారత క్రికెట్ పోటీలకు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్ఫీ నేత భట్టి విక్రమార్క, రోహాత్ చౌదరి ఇతర నేతలు హాజరయ్యారు.

ఆటలు క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపడానికి ఉపయోగపడతాయని నేతలు అన్నారు. ఓటమిని కూడా గెలుపునకు పునాదిగా మార్చుకునే స్ఫూర్తి క్రీడా మైదానంలోనే ఉంటుందని అన్నారు. ఇలాంటి స్ఫూర్తి రాజకీయాల్లోనూ ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. గెలిస్తే పొంగిపోవద్దని, ఓడితే కుంగి పోవద్దని వారు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: