అరుదైన ఆపరేషన్‌ చేసిన విజయవాడ వైద్యులు?

Chakravarthi Kalyan
900 గ్రాముల బరువుతో పుట్టిన నవజాత శిశువుకు విజయవాడ వైద్యులు అరుదైన ఆపరేషన్‌ చేశారు. విజయవాడ రెయిన్ బో ఆసుపత్రి వైద్యులు పేస్ మేకర్ ను అమర్చి అరుదైన శస్ర్త చికిత్స నిర్వహించారు. విజయవాడ రెయిన్ బో ఆసుపత్రికి వచ్చిన గర్భిణీ కవల పిల్లలకు జన్మనిచ్చింది. రెగ్యులర్ చెకప్ కు వచ్చిన సమయంలో గర్భిణి కడుపులో ఉన్న ఓ శిశువుకు గుండె వేగం తక్కువ ఉందని వైద్యులు గుర్తించారు. వెంటనే తదుపరి పరీక్షలు నిర్వహించారు.
సాధారణంగా పిల్లల గుండె నిమిషానికి  120 నుంచి 160 సార్లు కొట్టుకుంటుంది. అయితే ఈ శిశువుకు మాత్రం 55 నుంచి 60 సార్లే హృదయ స్పందన ఉందని గుర్తించారు. అందుకే 29 వారాలకు శస్త్రచికిత్స చేసి చిన్నారికి ప్రీ మెచ్యూర్ బేబికి వైద్య చికిత్సను అందించారు. తల్లి లో ఉన్న యాంటీ -రోయాంటీ బాడీస్ కారణంగా శిశువు లో ఉండే సాధారణ పేస్ మేకర్ వ్యవస్తను దెబ్బతీసిందని వైద్యులు గుర్తించారు. దీంతో మొదట తాత్కాలిక పేస్ మేకర్ ను అమర్చి వైద్య చికిత్సను అందించారు. రెయిన్ బో ఆసుపత్రి లో ఈయేడాదిలో 150 మంది ప్రీ మెచ్యూర్డ్ శిశువులకు వైద్యం అందించినట్లు వైద్యులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: