నిరుద్యోగులతో టీఎస్‌పీఎస్సీ ఆటలా?

Chakravarthi Kalyan
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగ ప్రకటనలు ఇస్తూ... ఫలితాలు ప్రకటించకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య అంటున్నారు. గురుకుల పీఈటీ పోస్టులను కోర్టు ఆదేశాల ప్రకారం భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. టీఎస్‌పీఎస్సీ వెంటనే పీఈటీ నియామకాలు చేపట్టాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఫలితాలు వెల్లడించక పోవడంతో మనస్థాపంతో చాలా మంది ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఆవేదన వ్యక్తంచేశారు.

ఎంపికైన అభ్యర్థులకు ఇంకా ఉద్యోగాలు ఇవ్వకుండా టీఎస్‌పీఎస్సీ జాప్యం చేస్తుందని  బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. ఆరుఏళ్లుగా పోస్టులను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య  మండిపడ్డారు. పీఈటీ అభ్యర్థుల భార్యా పిల్లలతో నరకయాతన అనుభవిస్తున్నారన్న కృష్ణయ్య  ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకొని  సమస్యను పరిష్కరించాలన్నారు. లేకపోతే ప్రగతి భవన్ ముట్టడిస్తామని కృష్ణయ్య వార్నింగ్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: