కేసీఆర్‌కు కొత్త కేసు.. కొత్త తలనొప్పి..?

Chakravarthi Kalyan
కేసీఆర్‌కు ఇప్పుడు మరో తలనొప్పి ఎదురుకాబోతోంది. ఎమ్మెల్యేలకు ఎర కేసు ఇప్పటికే ఆయనకు ఎదురుకొట్టింది. ఇప్పుడు ఇదే కేసులో తాము కూడా ఇంప్లీడ్ అవుతామని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలు ఒక్కో రోజు ఓకక్కొక్కరు చేరితే.. అందరూ ఒకేసారి చేరినట్టు విలీనం చేసుకున్నారని కాంగ్రెస్ నేత మల్లు రవి అంటున్నారు. 12మంది ఎమ్మెల్యేలు ఓకే రోజు టిఆర్ఎస్ లో చేరలేదని.. 12మంది ఓకే రోజు చేరనప్పటికీ ఓకే రోజు చేరినట్లుగా సీఏల్పీని విలీనం చేసినట్లుగా ప్రకటించారని మల్లు రవి తెలిపారు.

ఒక పార్టీ మరో పార్టీలో విలీనం చేయవచ్చు..కానీ ఎల్పీని ఎక్కడా విలీనం చేయడం కుదరదని.. ఎమ్మెల్యే ల కొనుగోలులో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలలో 3 కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లోకి వెళ్లిన వారేనని మల్లు రవి గుర్తు చేశారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు అమ్ముడు పోవడం అలవాటు గా మారిందన్న మల్లు రవి.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కాంగ్రెస్ ఇంప్లీడ్ అవుతుందని ప్రకటించారు. 12ఎమ్మెల్యేలు పార్టీ మారడం పై సీబీఐ డైరెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని.. 12 మంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ నుంచి వివిధ రూపాల్లో లబ్ది పొందారని.. ఆర్దికంగా ఎలా లబ్ధి పొందారో  అన్ని వివరాలు ఇస్తామని మల్లు రవి అంటున్నారు. మరి ఈ కేసు ఎలా మలుపు తిరుగుతుందో?

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: